ఏపీలో తొలిరోజు 229 నామినేషన్లు

రాష్ట్రంలో తొలిరోజు లోక్‌సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి.

Updated : 19 Apr 2024 06:40 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో తొలిరోజు లోక్‌సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గురువారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మంగళగిరి కూటమి అభ్యర్థిగా నారా లోకేశ్‌ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

భీమిలి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తిరుపతి వైకాపాఅభ్యర్థిగా భూమన అభినయ్‌రెడ్డి, తాడిపత్రి వైకాపా అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, శ్రీశైలం వైకాపా అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థిగా బుట్టా రేణుక, విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థిగా యలమంచిలి సత్యనారాయణచౌదరి, విశాఖ లోక్‌సభ స్థానానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని