Nadendla Manohar: వైకాపా నేతలు.. అమూల్‌ కోసమే పాలవెల్లువ పథకం: నాదెండ్ల మనోహర్‌

అవినీతిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Updated : 11 Nov 2023 15:43 IST

తెనాలి: అవినీతిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. పథకాలు నేరుగా, పారదర్శకంగా ప్రజలకు అందాలనే జనసేన పోరాటం చేస్తోందన్నారు. తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు. పాలవెల్లువ పథకం.. పాపాల వెల్లువగా మారిందనేది వాస్తవం అన్నారు. రూ.కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని నాదెండ్ల ప్రశ్నించారు. వైకాపా నేతలు, అమూల్‌ డెయిరీ కోసమే ప్రభుత్వం పాల వెల్లువ పథకాన్ని తీసుకొచ్చిందని నాదెండ్ల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని