Kejriwal: ఏళ్ల తర్వాత పంజాబ్‌కు నిజాయతీగల సీఎం: కేజ్రీవాల్‌

పంజాబ్‌కు చాలా ఏళ్ల తర్వాత నిజాయతీ గల వ్యక్తి సీఎం అవుతున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ  (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

Updated : 27 Feb 2024 16:25 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌కు చాలా ఏళ్ల తర్వాత నిజాయతీ గల వ్యక్తి సీఎం అవుతున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ  (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజలకు నిజాయతీతో కూడిన పాలనను అందిస్తామని పంజాబ్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో పంజాబ్‌లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అమృత్‌సర్‌లో భారీ రోడ్‌ షో నిర్వహించారు. కాబోయే సీఎం భగవంత్‌ మాన్‌తో కలిసి కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. 

పంజాబ్‌కు నిజాయతీగల వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్‌ అన్నారు. ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయీ ప్రజల కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సొంత పార్టీ నేత అయినా, ఎమ్మెల్యే అయినా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రానికి భగవంత్‌ మాన్‌ ఒక్కడే కాదని.. ప్రతి ఒక్కరూ ఓ ముఖ్యమంత్రేనని చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ నెల 16న సీఎం ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భగవంత్‌మాన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మంత్రుల ప్రమాణ స్వీకారం మరో రోజు ఉంటుందని తెలుస్తోంది. భ‌గ‌త్‌సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖాట్కర్‌ కలాన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 117 స్థానాలకు గానూ ఆప్‌ 92 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ కేవలం 18 సీట్లకే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని