అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్‌ నేతలు

ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆక్షేపించారు.

Updated : 27 Apr 2024 06:14 IST

హైదరాబాద్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆక్షేపించారు. పార్టీ నేతలు కపిలవాయి దిలీప్‌కుమార్‌, కత్తి వెంకటస్వామి, పుష్పలీల, దివ్యవాణి, వట్టికూటి రామారావు తదితరులతో కలిసి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ శుక్రవారం పసుపు నీళ్లతో స్తూపాన్ని శుద్ధి చేశారు. అనంతరం బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ ‘ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తే భారాసను మీరు రద్దు చేస్తారా? అని సీఎం సవాల్‌ విసిరింది కేసీఆర్‌కు కానీ, పార్టీలో ఏ హోదా లేని హరీశ్‌రావుకు కాదు. ఈ రోజు ఈ పార్టీ, రేపు ఏ పార్టీలోకి పోతారో ఆయనకే గ్యారంటీ లేదు. స్పీకర్‌ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారు. మీ రాజీనామా లేఖను స్పీకర్‌ ఫార్మాట్‌లో పంపండి. ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలవుతుంది. ఆ తర్వాత మీ రాజీనామా ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటా’ అని వెంకట్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని