ఫిర్యాదుకు వెళ్తే.. తిరిగి మాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసా?: తెదేపా

కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో జరిగిన ఘర్షణల్లో తెదేపా నేతలపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 25 Aug 2023 12:51 IST

గన్నవరం: కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో జరిగిన ఘర్షణల్లో తెదేపా నేతలపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ సైకో పాలనలో చూస్తున్నామని ధ్వజమెత్తారు. 

ఇప్పటి వరకు 50 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు.. ఇతరుల పేరిట 100 మందిపై పెట్టారని ఆరోపించారు. అమెరికాలో ఉన్న నాయకులపైనా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. గన్నవరం తెదేపా ఇన్‌ఛార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావును నియమించిన 24 గంటల్లోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 కేసులు పెట్టించారంటే ఆయన ఎంత పిరికివాడో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రపై వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ పన్నుతున్న కుట్రలపై కృష్ణా జిల్లా ఎస్పీకి ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నేతలు ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు