పెట్టుబడుల పేరుతో ఆన్‌లైన్‌లో ఘరానా మోసం.. రూ.300 కోట్లు టోకరా

ఆన్‌లైన్‌ యాప్‌లో ఓ వ్యక్తి.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోసాన్ని ఛేదించారు. నిందితుల ఖాతాల్లోని లావాదేవీల వివరాలు చూసి షాక్‌ అయ్యారు.

Published : 25 Jun 2022 05:51 IST

న్‌లైన్‌ యాప్‌లో ఓ వ్యక్తి.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోసాన్ని ఛేదించారు. నిందితుల ఖాతాల్లోని లావాదేవీల వివరాలు చూసి షాక్‌ అయ్యారు. సుమారు రూ.300 కోట్లకు టోకరా వేసినట్లు గుర్తించారు. ఈ సంఘటన హరియాణాలో వెలుగు చూసింది. హిసార్‌లోని పటేల్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ విన్‌మనీ అనే మొబైల్‌ గేమింగ్‌ యాప్‌లో రూ.లక్షలు పెట్టుబడి పెట్టానని, అయితే ఆ డబ్బు తిరిగి రాలేదని ఫిర్యాదు చేశాడు. విన్‌మనీ యాప్‌లో ఫిర్యాదుదారుడు డిపాజిట్‌ చేసిన డబ్బు ..మహారాష్ట్రలోని ఓ బ్యాంకు ఖాతాకు వెళ్లిందని, ఆపై ఒడిశాలోని బ్యాంకు ఖాతాలో జమ అయిందని పోలీసులు తేల్చారు. ఈ మోసానికి సంబంధించి చైనా, దుబాయ్‌లలోని ముఠాలకు కూడా సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకడైన ఆకాశ్‌కు జైపుర్‌లో 13 బ్యాంక్‌ ఖాతాలున్నట్లు విచారణలో తేల్చారు. మరో నిందితుడు సచిన్‌ గుడాలియా ఖాతా నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని