ఫోన్లోనే విడాకులు.. రూపాయి భరణం

విడాకుల కోసం ఓ వ్యక్తి పంచాయతీని ఆశ్రయించాడు. అక్కడి పెద్దలు భార్యకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే

Published : 04 Apr 2022 10:58 IST

విడాకుల కోసం ఓ వ్యక్తి పంచాయతీని ఆశ్రయించాడు. అక్కడి పెద్దలు భార్యకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అతనికి విడాకులు ఇప్పించేశారు. కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో ఈ ప్రక్రియ ముగిసింది. ఈ విడాకులకు బాధితురాలి తండ్రి కూడా ఒప్పుకున్నాడు. ఆమెకు ఇప్పించిన భరణం.. ఒక్క రూపాయి! మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా సిన్నర్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిన్నర్‌కు చెందిన బాధితురాలికి కొంతకాలం క్రితం అహ్మద్‌నగర్‌ జిల్లా లోనీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. భర్త వేధింపులను తట్టుకోలేక ఆమె కొద్దిరోజులకే పుట్టింటికి వచ్చేసింది. విడాకులు ఇవ్వాలని భర్త నిర్ణయించుకున్నాడు. ఇందుకు చట్టపరంగా సంప్రదించకుండా నేరుగా పంచాయతీని ఆశ్రయించాడు. వైదు సామాజికవర్గానికి చెందిన పెద్దల సమక్షంలో ఆ మహిళ లేకుండానే విచారణ పూర్తి చేశారు. ఇది జరగడానికి 8 రోజుల ముందే అతను మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ముతామటీ అభియాన్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు ఆమెకు అండగా నిలిచారు. వారి సూచన మేరకు బాధితురాలు.. భర్త, అతని కుటుంబసభ్యులు సహా తీర్పును ఇచ్చిన పంచాయతీ పెద్దలపై ఫిర్యాదు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని