ICC: బౌలింగ్‌ ఆలస్యం చేస్తే 5 పరుగుల పెనాల్టీ

ఆట వేగాన్ని పెంచేందుకు వన్డే, టీ20 క్రికెట్లో ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను మొదలెట్టడంలో ఫీల్డింగ్‌ జట్టు మూడోసారి విఫలమైతే ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. మంగళవారం ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 22 Nov 2023 08:33 IST

అహ్మదాబాద్‌: ఆట వేగాన్ని పెంచేందుకు వన్డే, టీ20 క్రికెట్లో ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను మొదలెట్టడంలో ఫీల్డింగ్‌ జట్టు మూడోసారి విఫలమైతే ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. మంగళవారం ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘వన్డే, టీ20 క్రికెట్లో డిసెంబరు 2023 నుంచి ఏప్రిల్‌ 2024 వరకు ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఓవర్ల మధ్య సమయం వృథా కాకుండా చూడాలన్నదే ఉద్దేశం’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పిచ్‌ను నిషేధించే నిబంధనల్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. అయిదేళ్ల కాలంలో ఒక పిచ్‌ 5 అయోగ్యతా పాయింట్లు పొందితే నిషేధానికి గురయ్యేది. ఇప్పుడు ఆ పాయింట్లను ఆరుకు పెంచినట్లు ఐసీసీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని