Ravindra Jadeja: జడేజా మళ్లీ నంబర్‌వన్‌

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్‌ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అతను మళ్లీ నంబర్‌వన్‌గా నిలిచాడు.

Updated : 24 Mar 2022 07:27 IST

దుబాయ్‌: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్‌ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అతను మళ్లీ నంబర్‌వన్‌గా నిలిచాడు. శ్రీలంకతో తొలి టెస్టులో అజేయంగా 175 పరుగులు చేయడంతో పాటు తొమ్మిది వికెట్లు తీసిన అతను అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత విండీస్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ అతణ్ని వెనక్కి నెట్టాడు. ఇప్పుడు జడ్డూ మరోసారి హోల్డర్‌ను దాటి తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్లలో అశ్విన్‌ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో అశ్విన్‌, బుమ్రా వరుసగా రెండు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సారథి రోహిత్‌ శర్మ ఓ స్థానం తగ్గి ఏడో ర్యాంకులో నిలిచాడు. కోహ్లి (9), పంత్‌ (10) స్థానాల్లో మార్పు లేదు. లబుషేన్‌ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలోనే ఉన్నాడు. రోహిత్‌ మూడు నుంచి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. బౌలర్లలో బుమ్రా ఆరో స్థానంలోనే ఉన్నాడు. ఆల్‌రౌండర్లలో జడేజా ఓ ర్యాంకు పడిపోయి పదో స్థానంలో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని