టీ20 ప్రపంచకప్‌ అంపైర్‌గా నితిన్‌

ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత అంపైర్‌ నితిన్‌ మేనన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మొత్తం 16 మంది అంపైర్లు విధులు నిర్వహిస్తుండగా.. భారత్‌ నుంచి నితిన్‌ ఒక్కడికే అవకాశం దక్కింది.

Published : 05 Oct 2022 02:53 IST

దుబాయ్‌: ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత అంపైర్‌ నితిన్‌ మేనన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మొత్తం 16 మంది అంపైర్లు విధులు నిర్వహిస్తుండగా.. భారత్‌ నుంచి నితిన్‌ ఒక్కడికే అవకాశం దక్కింది. భారత్‌ తరఫున ఏకైక ఐసీసీ ఎలీట్‌ అంపైర్‌ కూడా అతనే. ప్రపంచకప్‌ కోసం నితిన్‌ ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ అంపైర్లు: నితిన్‌ మేనన్‌, ఆడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌, అలీం దార్‌, ఎహసాన్‌ రాజా, క్రిస్టోఫర్‌ బ్రౌన్‌, క్రిస్టోఫర్‌ గఫానీ, జోయెల్‌ విల్సన్‌, కుమార ధర్మసేన, లాంగ్టన్‌ రుసెర్‌, మరియస్‌ ఎరాస్మస్‌, మైకెల్‌ గాఫ్‌, పాల్‌ రైఫిల్‌, పాల్‌ విల్సన్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటెల్‌బొరో, రోడ్నీ టక్కర్‌

రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్‌, క్రిస్‌ బ్రాడ్‌, డేవిడ్‌ బూన్‌, రంజన్‌ మదుగలె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని