Jasprit Bumrah : భారత్‌ సృష్టించిన గొప్ప బౌలర్‌.. బుమ్రాపై ఇంగ్లాండ్‌ మీడియా ప్రశంసలు

టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా(Jasprit Bumrah) ప్రతిభను ఇంగ్లాండ్‌ మీడియ ఆకాశానికెత్తింది. అతడు అద్భుతమైన బౌలర్‌ అంటూ కొనియాడింది.

Updated : 07 Feb 2024 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు(IND vs ENG)లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ ఇండియా(Team India) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బజ్‌బాల్‌ ఆటతో ప్రత్యర్థి కంగారు పెట్టినా.. ఆ జట్టును మన బౌలర్లు కట్టడి చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా స్టార్‌ పేసర్‌ బుమ్రా(Jasprit Bumrah) మొత్తం 9 వికెట్లు తీసి.. విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌ను 1-1తో సమం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన అతడిపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అతడి ప్రతిభను ఇంగ్లాండ్‌ మీడియా మెచ్చుకుంది.

బుమ్రా బంతులకు తమ వద్ద సమాధానమే లేనట్లుగా.. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు వెనుదిరిగారు. ముఖ్యంగా కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ అతడి బంతిని ఎదుర్కోలేక.. ఔటైన అనంతరం బ్యాట్‌ కిందపడేసిన విషయం అందరికీ గుర్తుంటుంది. మ్యాచ్‌ అనంతరం స్టోక్స్‌ కూడా బుమ్రాను అద్భుతమైన బౌలర్‌గా పేర్కొన్నాడు. టీ20 క్రికెట్‌ నుంచి అతడు ఎదిగిన తీరుపై ఇంగ్లాండ్‌ మీడియా ప్రశంసలు కురిపించింది.

వారు రంజీల్లో ఆడాల్సిందే..

‘‘టీ20 క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బౌలర్‌గా బుమ్రాను సృష్టించింది. మలింగా నుంచి బుమ్రా ఎంతో నేర్చుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో గొప్ప ప్రభావాన్ని చూపించడానికి అతడి వైట్‌ బాల్‌ నైపుణ్యాలను ఉపయోగిస్తున్నాడు’’- ది టెలిగ్రాఫ్‌

‘‘బుమ్రా బౌలింగ్‌తో నెక్స్ట్‌ టైమ్‌ తెల్లవారుజామున 4 గంటలకే అలారం మోగుతుంది’’-బీబీసీ

‘‘అతడు ఆటలో దిగ్గజం. భారత్‌ సృష్టించిన గొప్ప సీమర్‌. సీమ్‌ బౌలింగ్‌ గొప్ప కళ. భారత పిచ్‌లపై మ్యాజిక్‌ చేయడం ఇంకా కష్టం’’ -ఇండిపెండెంట్‌ యూకే.

‘‘బుమ్రా ప్రపంచస్థాయి బౌలర్‌. రివర్స్‌ స్వింగ్‌తో అతడు సాధించిన వికెట్లు అద్భుతం’’-ది డెయిలీ మెయిల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని