Mohammed Shami: రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న షమీ.. మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడా?

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియాలో తిరిగి చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో రంజీ ట్రోఫీ (Ranji Trophy) బరిలోకి దిగిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) అదరగొడుతున్నాడు. బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ.. ఎలైట్ గ్రూప్ సిలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో (3/44)తో మెరిసిన ఇతను.. రెండో ఇన్నింగ్స్‌లో (5/61) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో గుజరాత్‌ను బెంగాల్ 141 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇదే రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్‌తో జరిగిన పోరులో షమీ ఏడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
35 ఏళ్ల షమీ భారత్ తరఫున చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఏ ఫార్మాట్లోనూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెడుతున్నారనే వాదన ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ చోటు దక్కకపోవడంపై షమీ సెలక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్‌పై విమర్శలు చేశాడు. రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు సరిపోయే ఫిట్నెస్.. వన్డేలు ఆడటానికి సరిపోదా? అని సెలక్టర్లను ప్రశ్నించాడు. రంజీల్లో చేస్తున్న ప్రదర్శన చూసైనా షమీని జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో, రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి గువాహటిలో జరగనుంది. ఈ సిరీస్ కోసం త్వరలో జట్టును ప్రకటించనున్నారు. మరి ఇటీవల ఈడెన్‌లో మెరిసిన షమీని సఫారీలతో టెస్టులకు ఎంపిక చేస్తారో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆమె బౌలింగే మాకు సర్ప్రైజ్.. మేం సిద్ధం కాలేకపోయాం : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా
భారత జట్టు ప్రయోగించిన ఓ అస్త్రం తమ విజయాన్ని అడ్డుకుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ తెలిపింది. - 
                                    
                                        
ఫైనల్‌కు ముందు సచిన్‌తో చాట్.. అంతా మార్చేసింది: షెఫాలి వర్మ
Shafali Verma: మ్యాచ్‌కు ముందు సచిన్‌తో మాట్లాడటం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని షెఫాలి వెల్లడించింది. - 
                                    
                                        

అమ్మాయిల పట్టు.. బంతి చేయి దాటితే ఒట్టు..!
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడింట్లో ఏది విఫలమైనా ఛాంపియన్‌గా నిలవడం కష్టం. కానీ, భారత మహిళా జట్టు మాత్రం మూడింట్లోనూ సత్తా చాటింది. - 
                                    
                                        

మ్యాచ్ బాల్ వేళ.. 1983లో గావస్కర్.. నేడు హర్మన్‌ప్రీత్
తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన అనంతరం హర్మన్‌ప్రీత్ బంతిని పాకెట్లో భద్రంగా దాచిపెట్టుకొన్న తీరు క్రికెట్ అభిమానులకు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ను గుర్తు చేసింది. - 
                                    
                                        

వైరల్ పిక్.. గురుభక్తి చాటుకున్న హర్మన్‌ప్రీత్
మైదానంలో హర్మన్‌ప్రీత్ తన గురువు కాళ్లకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. - 
                                    
                                        

‘మీరు భావితరాల ఆడ పిల్లలకు ఘన వారసత్వాన్ని ఇచ్చారు’
భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్‌ను నెగ్గడంపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తమ స్పందనను తెలియజేశారు. - 
                                    
                                        

ఇంకా కలలోనే ఉన్నామా: జెమీమా-మంధాన కప్ ఫొటోలు వైరల్
Womens World Cup: వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిల జట్టు ఆనందంలో మునిగితేలుతోంది. - 
                                    
                                        

వన్డే ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా
తొలిసారి ప్రపంచ కప్‌ను నెగ్గిన భారత మహిళా జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. హర్మన్ సేనకు భారీ నజరానా ఇస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్
భారత మహిళా జట్టు అద్భుతం చేసిందని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కొనియాడాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని విజేతగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించాడు. - 
                                    
                                        

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్ ప్రీత్ కౌర్
ఒక్క ఓటమితో జట్టంతా డీలా పడటం సహజం. కానీ, దాన్నుంచి బయటకొచ్చి విజేతగా నిలవడం మాత్రం అద్భుతం. అలాంటి దానిని భారత మహిళా జట్టు చేసి చూపించింది. - 
                                    
                                        

సచిన్ చేతుల మీదుగా..
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. - 
                                    
                                        

వాళ్ల వెనుక అతడు
భారత మహిళల క్రికెట్ జట్టులో రెండేళ్ల కిందటి వరకు స్థిరత్వం లేదు. కొన్ని మ్యాచ్‌లు గెలవడం.. తర్వాత గెలిచే మ్యాచ్‌లు ఓడిపోవడం.. ఇలా సాగేది ప్రయాణం. కానీ ఇప్పుడు భారత్ మారింది. - 
                                    
                                        

కల తీరెలే కప్పందగా..
భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షెఫాలి వర్మ ఆటే హైలైట్. ప్రతీక రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె.. తన తొలి మ్యాచ్‌లో విఫలమైనా ఈసారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది. - 
                                    
                                        

వచ్చింది.. గెలిపించింది
వారం ముందు ఆ అమ్మాయి అందరిలాగే ప్రపంచకప్ వీక్షకురాలు. టీవీలో భారత జట్టు ఆట చూస్తూ ఉంది. కానీ ఉన్నట్లుండి అంతా మారిపోయింది. ఆమె టీవీ లోపలికి వెళ్లిపోయింది. భారత జట్టులో సభ్యురాలై ప్రపంచకప్‌లో ఆడేసింది. - 
                                    
                                        

కొత్త బంగారు లోకం
ప్రయాణ ఖర్చుల కోసం చందాలు వేసుకోవడం దగ్గర్నుంచి.. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందే వరకు! రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ పట్టించుకోని స్థితి నుంచి.. రక్షణ వలయం లేకుండా బయటికి వెళ్లలేని దశ వరకు! ప్రత్యక్ష ప్రసారమే లేని రోజుల నుంచి. - 
                                    
                                        

మన వనిత.. విశ్వవిజేత
ఆట ఏదైనా ప్రపంచకప్ అంటే.. ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు, బంతి పట్టిన ప్రతి అమ్మాయీ దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారీ నిరాశే. - 
                                    
                                        

హర్మన్ డెవిల్స్
అప్పట్లో కపిల్ నేతృత్వంలో పురుషుల క్రికెట్లో దేశానికి తొలి ప్రపంచ కప్‌ను అందించిన జట్టును ‘కపిల్ డెవిల్స్’ అన్నారు. అసలు అంచనాలే లేకుండా అద్వితీయ ప్రదర్శన చేస్తూ అరివీర భయంకర వెస్టిండీస్‌ను ఓడించి 1983లో అద్భుతం చేసింది ఆ భారత జట్టు. - 
                                    
                                        

దొరికింది ఓ ఆణిముత్యం
భారత జట్టుకు ఆడడం ఏ ప్లేయర్‌కైనా పెద్ద కల. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వస్తే! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే! ఆ అదృష్టం తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. - 
                                    
                                        

మహిళల క్రికెట్లో మలుపు
వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయం యావత్ మహిళల క్రికెట్‌ను మార్చబోతోందని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. 1983లో కపిల్ సేన విజయం ప్రపంచ క్రికెట్‌ను మార్చినట్లుగానే.. - 
                                    
                                        

మనకొకటి..
అర్ష్‌దీప్ జట్టులో ఉండాలి.. గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 0-1తో వెనకబడిన దశలో అతడికి చోటు లభించింది. ఆ అవకాశాన్ని అతడు వమ్ము చేయలేదు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

మీకు హైకమాండ్ చెప్పిందా: సీఎం మార్పుపై సిద్ధరామయ్య
 - 
                        
                            

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్‌తో టీజర్
 - 
                        
                            

భారత్ టెక్ పవర్‌హౌస్‌గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
 - 
                        
                            

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. నడుములోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన!
 - 
                        
                            

ఆమె బౌలింగే మాకు సర్ప్రైజ్.. మేం సిద్ధం కాలేకపోయాం : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా
 - 
                        
                            

పాక్ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: బాంబు పేల్చిన ట్రంప్
 


