Rohit Sharma: నన్ను పెళ్లి చేసుకుంటావా..? అభిమానికి రోహిత్ శర్మ సరదా ప్రపోజల్
విశాఖ విమానాశ్రయంలో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఓ అభిమానికి సరదా ప్రపోజల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma).. అభిమానులతో సరదాగా ఉంటాడు. వారిపై తన ప్రేమను చూపిస్తాడు. ఇలాంటి ఘటనే వైజాగ్(Vizag ODI)లో చోటుచేసుకుంది. ఓ అభిమానికి హిట్‌మ్యాన్ సరదాగా ప్రేమ ప్రతిపాదన చేశాడు. పువ్వు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటావా..? అని అడిగాడు. అసలేం జరిగిందంటే..
తొలి వన్డేకు వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేని రోహిత్ రెండో వన్డే(IND vs AUS)కు జట్టుతో చేరాడు. జట్టు సభ్యులతో కలిసి వైజాగ్ విమానాశ్రయంలో దిగాడు. ఆటగాళ్లంతా బయటకు వస్తుండగా.. ఓ అభిమాని వారిని ఫాలో అవుతూ.. ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీశాడు. ఇంతలో అతడి వద్దకు రోహిత్ వచ్చి.. తన వద్ద ఉన్న గులాబీని ఇచ్చాడు. ‘తీసుకో.. ఇది నీ కోసమే.. నన్ను పెళ్లి చేసుకుంటావా..’ అని సరదాగా అడిగాడు. రోహిత్ తనను పలకరించినందుకు సంతోషించిన ఆ అభిమాని.. ఆ ప్రపోజల్‌కు మాత్రం కాస్త షాక్ అయినట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక వైజాగ్ వన్డే(IND vs AUS)లో టీమ్‌ఇండియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో విఫలమై.. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ