
Published : 26 Jan 2022 05:34 IST
జస్వంత్‌రెడ్డికి శౌర్యచక్ర
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మారుప్రోలు జస్వంత్‌కుమార్‌రెడ్డికి శౌర్యచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సైన్యం, పోలీసు, ఇతర శాఖల్లో ఉత్తమ సేవలందించిన వారికి వివిధ పురస్కారాలను ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద గతేడాది జులై 8న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో జస్వంత్‌రెడ్డి వీరమరణం పొందారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం. 2016లో మద్రాస్ రెజిమెంట్‌లో జవాన్‌గా ఆయన చేరారు. రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి 15 మంది ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు.
Tags :