వాణిజ్య సిలిండరుపై మళ్లీ రూ.103 బాదుడు

వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల వంట గ్యాస్‌ సిలిండరు ధరను వరుసగా రెండో నెలా కేంద్రం భారీగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, వంటగ్యాస్‌ ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తేదీన కేంద్ర చమురు సంస్థలు ధరలను ప్రకటిస్తాయి.

Published : 02 Dec 2021 05:16 IST

తాజా ధర రూ.2,278

ఈనాడు, హైదరాబాద్‌: వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల వంట గ్యాస్‌ సిలిండరు ధరను వరుసగా రెండో నెలా కేంద్రం భారీగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, వంటగ్యాస్‌ ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తేదీన కేంద్ర చమురు సంస్థలు ధరలను ప్రకటిస్తాయి. అందులో భాగంగా బుధవారం నుంచి నూతన ధరలను అవి ప్రకటించాయి. తాజాగా సిలిండరు ధర రూ.2,278కి చేరింది. గత నెలతో పోలిస్తే రూ.103 పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సిలిండరు ధరపై రూ.798 పెరిగినట్లయింది. 2014 తరవాత సిలిండరు ధర రూ.2000 దాటటం ఇది రెండోసారి. వాణిజ్యావసరాలకు వాడే ఈ బండపై బాదుడు హోటళ్లతో పాటు రోడ్డు వెంట విక్రయించే ఆహార పదార్థాల ధరలను ప్రభావితం చేయనుంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండరు ధరలో ఎలాంటి మార్పూ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని