Banks: నేడు, రేపు మూతపడనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని 70 వేల మంది బ్యాంకు ఉద్యోగులు రెండు

Updated : 16 Dec 2021 07:09 IST

రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ఈనాడు, హైదరాబాద్‌-ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని 70 వేల మంది బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులు సమ్మెలో పాల్గొంటున్నట్లు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ శ్రీరాం, అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.నాగేశ్వర్‌లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని కోఠిలో సమ్మె ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతో పాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది.

బ్యాంకుల కార్పొరేటీకరణకు కేంద్రం కుట్ర

బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని, దాన్ని అడ్డుకునేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులమంతా దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నామని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తెలంగాణ విభాగం కన్వీనర్‌ ఆర్‌.శ్రీరాం అన్నారు. సమ్మెకు సంబంధించిన కరపత్రాలను బుధవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ల నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ నాయకులు వెంకటస్వామి, అప్పలస్వామి, నాగేశ్వర్‌రావు, వెంకటరమణ, సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని