సహకార అధికారులకు న్యాయం చేయాలి

తెలంగాణ సహకారశాఖలో జీతభత్యాల విషయంలో ఆది నుంచీ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని... కొత్త పీఆర్‌సీలో తమకు పూర్తి న్యాయం చేయాలని సహకారశాఖ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది.

Updated : 19 May 2024 05:31 IST

 పీఆర్‌సీ ఛైర్మన్‌కు గెజిటెడ్‌ అధికారుల సంఘం వినతి

శివశంకర్‌కు పీఆర్‌సీ ప్రతిపాదనలు సమర్పిస్తున్న సహకార గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, ఇతర నేతలు

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణ సహకారశాఖలో జీతభత్యాల విషయంలో ఆది నుంచీ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని... కొత్త పీఆర్‌సీలో తమకు పూర్తి న్యాయం చేయాలని సహకారశాఖ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. అర్హత, హోదాలకు తగిన వేతనాలను ఇవ్వాలని అభ్యర్థించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచక్రవర్తి, ఇతర నేతలు శివశంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్‌సీపై తమ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రభుత్వంలో కీలక విధులు నిర్వర్తిస్తున్నా... జీతభత్యాల విషయంలో తమపై వివక్ష చూపుతున్నారని వారు తెలిపారు. అదనపు రిజిస్ట్రార్లు, సంయుక్త రిజిస్ట్రార్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్లు, డిప్యూటీ, సహాయ రిజిస్ట్రార్లు తదితర అధికారులకు ఇతర శాఖల్లో ఇదే హోదాతో పనిచేసే వారికంటే తక్కువ వేతనాలు వస్తున్నాయని చెప్పారు. ఆడిటింగ్‌తో పాటు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యటించాల్సి ఉన్నందున తమకు నెలకు రూ.10 వేల ఫిక్స్‌డ్‌ టీఏతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పించాలని అభ్యర్థించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని