కొలిక్కిరాని ధరణి పెండింగ్‌ సమస్యలు

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది.

Published : 19 May 2024 02:08 IST

మంగళవారం మరోమారు భేటీ 

ఈనాడు, హైదరాబాద్‌: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. సభ్యులు కోదండరెడ్డి, రేమండ్‌పీటర్, సునీల్‌కుమార్, మధుసూదన్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ హాజరై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినప్పటికీ స్పష్టత రానట్లు తెలిసింది. రాష్ట్రంలో 2.46 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వాటి పరిష్కారానికి మార్చి 1 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌(మార్చి 16వ తేదీ) వచ్చే నాటికి 1.10 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన పరిశీలన పూర్తి చేశారు. అంతటితో ప్రక్రియ నిలిచిపోయింది. పెండింగ్‌ దరఖాస్తులే అయినప్పటికీ స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో చేపట్టడంతో కోడ్‌ అడ్డంకిగా మారింది. జూన్‌ 4 నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ధరణి కమిటీకి లక్ష్యం నిర్ణయించగా పెండింగ్‌ సమస్యలే కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, మంగళవారం మరోమారు భేటీ కావాలని కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని