Published : 24/02/2023 21:19 IST

నిమ్మచెక్కలతో ప్రయోజనాలెన్నో..!

సీజన్‌తో సంబంధం లేకుండా నిమ్మకాయలను ఉపయోగిస్తుంటాం. నిమ్మకాయల నుంచి రసం పిండుకున్న తర్వాత వాటి చెక్కలను చాలామంది పడేస్తుంటారు. కానీ వాటిని కూడా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి...

బీట్‌రూట్, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి పండ్లను కట్‌ చేస్తున్నప్పుడు చేతులు రంగు మారుతుంటాయి. ఆ మరకలు పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దుకుంటే సరిపోతుంది.

జిడ్డుగా మారిన వంటింటి సింకును నిమ్మచెక్కతో రుద్ది చూడండి. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

చెమట వల్ల బూట్లు దుర్వాసన వస్తుంటాయి. ప్రతిసారీ బూట్లను కడగలేం. అలాంటప్పుడు ఎండబెట్టిన నిమ్మచెక్కలని బూట్లలో వేసి ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటాయి.

తువాళ్లకు పట్టిన మరకలు ఒక పట్టాన వదలవు. ఇలాంటప్పుడు నిమ్మతొక్కలు, వంటసోడా వేసిన నీటిలో వాటిని నానబెట్టి ఉతికితే తెల్లబడతాయి.

వాడేసిన నిమ్మచెక్కలని ఉప్పులో ముంచి వాటితో కాయగూరల బోర్డుని రుద్దితే మరకలు లేకుండా కనిపిస్తుంది.

వెనిగర్‌లో నిమ్మతొక్కలను వేసి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజున కాసిన్ని నీళ్లు కలిపి ఓ సీసాలో తీసుకోవాలి. దీంతో అద్దాలు, స్నానాల గదుల గోడలు శుభ్రం చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని