Published : 20/12/2021 20:12 IST

వెజైనా బిగుతుగా మారాలంటే ఏం చేయాలి?

హలో మేడమ్.. నాకు మూడు సార్లు నార్మల్ డెలివరీనే అయింది. దాంతో నా వెజైనా వదులుగా మారింది. మళ్లీ బిగుతుగా మారేందుకు ఏమైనా మార్గాలుంటే (చికిత్సలు/క్రీమ్స్‌/జెల్స్‌) చెప్పగలరు. - ఓ సోదరి

జ. సహజ ప్రసవాల తర్వాత కొంత వరకు వెజైనా వదులు కావడం సహజం. దీనికి క్రీమ్స్‌, జెల్స్‌ వంటివేవీ పని చేయవు. ముందుగా మీరు చేయాల్సింది.. కీగల్‌ (Kegel) వ్యాయామాలు సాధన చేయడం! అవి కటి వలయం, గర్భాశయం, యోని చుట్టూ ఉండే కండరాల బలం పెరగడానికి తోడ్పడే ప్రత్యేకమైన వ్యాయామాలు. అంతకంటే ముందుగా ఓసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వారు పరీక్ష చేసి.. వెజైనా ఎంత వదులుగా ఉందో చూసి.. దాన్ని బట్టి ఎటువంటి వ్యాయామాలు చేయాలో సూచిస్తారు. ఇందుకోసం ఫిజియోథెరపిస్ట్‌ దగ్గరికి పంపిస్తారు. దాని వల్ల కూడా ఫలితం లేకపోతే ఆపరేషన్‌ చేసి వదులైన కండరాలను దగ్గరికి తెచ్చి తిరిగి కుట్లు వేయాల్సి ఉంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని