Black Sea: తుపాను బీభత్సం.. 20 లక్షలమంది అంధకారంలో!

తుపాను కారణంగా దక్షిణ రష్యాతోపాటు క్రిమియా తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 20 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు.

Published : 27 Nov 2023 21:43 IST

మాస్కో: నల్ల సముద్రం (Black Sea)లో ఏర్పడిన తుపాను కారణంగా రష్యా ఆక్రమిత క్రిమియా (Crimea) అతలాకుతలమైంది. దక్షిణ రష్యాలోని సోచీ తీరంలోనూ పెద్దఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అనాపా, కుబాన్‌ తదితర ప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. బలమైన గాలుల ధాటికి విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోని మాస్కో ఆక్రమిత ప్రాంతం, క్రిమియాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆయా ఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఉక్రెయిన్‌లోనూ 2 వేల పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని స్థానిక యంత్రాంగం తెలిపింది.

మళ్లీ వందల సంఖ్యలో భూప్రకంపనలు.. వణుకుతున్న గ్రిండావిక్‌

ఈ తుపాను కారణంగా క్రిమియాలోని ఆయా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గంటకు 144 కి.మీల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయని, గత 16 ఏళ్లలో అత్యంత తీవ్రమైన తుపాను ఇదేనని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేశారు. వరదల కారణంగా సెవస్తొపోల్‌లో ఓ భారీ అక్వేరియంలో 800కుపైగా అరుదైన చేపలు, ఇతర జలచరాలు మృత్యువాతపడ్డాయని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నోవోరోసిస్క్‌ నౌకాశ్రయంలో చమురు లోడింగ్‌ను నిలిపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు