Chinese restaurant : చైనీస్‌ రెస్టారంట్‌లో వికృత చేష్టలు.. నోట్లో నోరు పెట్టి తినిపిస్తారట!

చైనాలోని (China) ఓ రెస్టారంట్‌ యాజమాన్యం (Restaurant) కస్టమర్లకు నోట్లో నోరు పెట్టి తినిపించే వెయిటర్లను నియమించింది. దాంతో ఆ రెస్టారంట్‌కు మహిళా కస్టమర్ల తాకిడి పెరిగింది.

Updated : 31 Jul 2023 18:17 IST

బీజింగ్‌ : కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఓ చైనీస్‌ రెస్టారంట్ (Chinese restaurant) యాజమాన్యం వికృత చర్యలకు తెరతీసింది. కండలు తిరిగిన వెయిటర్లతో నృత్యాలు, వారితో మహిళా కస్టమర్లకు నోట్లో నోరు పెట్టి తినిపించడం వంటి చేష్టలు చేయించింది. ఈ వీడియోలు కాస్తా వైరల్‌గా మారడంతో అధికారులు ఆ రెస్టారంట్‌ను సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌ జిషువాంగ్‌బన్న దాయ్‌ అటానమస్‌ ప్రిఫెక్షర్‌లోని ఓ రెస్టారంట్‌కు ఏప్రిల్‌-జులై మధ్య విపరీతంగా పర్యాటకులు తరలివెళ్లారు. ఆ రెస్టారంట్ సియామీ థీమ్‌ను ప్రచారం చేసింది. అందులో పొడవైన, కండలు తిరిగిన పురుషులు వెయిటర్లుగా పనిచేసేవారు. వారు చొక్కా లేకుండా, కొన్నిసార్లు అర్ధ నగ్నంగా నృత్యం చేసి మహిళా కస్టమర్లను అలరించేవారు. దాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో కస్టమర్ల తాకిడి మరింత పెరిగింది. 

68వ అంతస్తు నుంచి పడి సాహసికుడి మృతి..!

దాంతో రెస్టారంట్ యాజమాన్యం వింత పోకడలను తీసుకొచ్చింది. ‘రాడ్‌ లికింగ్‌’ అనే నృత్యాన్ని ప్రవేశపెట్టింది. ఇది చూడటానికి పోల్‌ డ్యాన్స్‌ను పోలి ఉంటుంది. కానీ, కామకేళిని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. ఈ నృత్యాలు చేస్తూనే వెయిటర్లు తమ నోట్లో ఆహారం పెట్టుకొని మహిళా కస్టమర్లకు తినిపిస్తారు. ఆసక్తిగల మహిళలకు ఇక్కడ ‘షోల్డర్‌ మసాజ్‌’ కూడా చేసేవారు. 

రెస్టారంట్‌లో హద్దు దాటి ప్రవర్తిస్తున్నారన్న విషయం అధికారుల దృష్టికి రావడంతో వారు తనిఖీలు చేశారు. సామాజిక విలువలకు, సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారనే కారణంతో అధికారులు ఈ రెస్టారంట్‌ను సీజ్‌ చేశారు. అక్రమ మార్గంలో సంపాదించిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు పదిరెట్ల మొత్తాన్ని జరిమానాగా విధించారు. తొలుత ఇక్కడ ఆరుగురు నటులు సాధారణ నృత్యాలు చేసేవారు. కస్టమర్లు వాటిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టడంతో యాజమాన్యం ఈ వింత నృత్యాలు చేయించడానికి పూనుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని