Viral Video: బైక్‌పై ఎద్దుతో రయ్‌..రయ్‌..

ఓ వ్యక్తి ఎద్దును తన బైక్‌పై తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌పై ఎద్దును ముందు కూర్చోబెట్టుకుని వేగంగా నడుపుతున్నాడు.

Updated : 14 Nov 2023 07:46 IST

వ్యక్తి ఎద్దును తన బైక్‌పై తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌పై ఎద్దును ముందు కూర్చోబెట్టుకుని వేగంగా నడుపుతున్నాడు. అంత వేగంతో వెళ్తున్నా ఆ ఎద్దు.. ఎటూ కదలకుండా ముందు కూర్చుని అటూ ఇటూ చూస్తోంది. ఈ వీడియోను ఓ కారు డ్రైవర్‌ తన మొబైల్‌లో రికార్డ్‌ చేశారు.ఈ వీడియోను నరేశ్‌ బహ్రెయిన్‌ అనే వ్యక్తి తన ఎక్స్‌(ట్విటర్‌) హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికిపైగా వీక్షించారు. ఇది నైజీరియాలో జరిగి ఉంటుందని.. అక్కడి ప్రజలే ఇలాంటి వింత పనులు చేస్తారంటూ కొందరు నెటిజన్లు స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు