Google Map: గూగుల్‌ మ్యాప్‌ చూపిన షార్ట్‌కట్‌.. ఎడారిలో ఇరుక్కుపోయిన కార్లు..!

తొందరగా ఇంటికి వెళ్లాలని కొందరు గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకొని ప్రయాణం మొదలుపెట్టారు. చివరికి ఎడారిలో తేలారు. 

Published : 24 Nov 2023 12:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడి.. మన కామన్‌సెన్స్‌ను వదిలేస్తే అవస్థలు తప్పవని అమెరికాలో జరిగిన ఓ ఘటన చెబుతోంది. షెబ్లీ ఎస్లెర్‌, ఆమె సోదరుడు,  కొందరు తొందరగా ఇంటికి వెళ్లాలని గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకొని తమ వాహనాల్లో ప్రయాణం మొదలుపెట్టారు. చివరికి అది వారిని ఎడారిలోకి తీసుకెళ్లి వదిలేసింది. ఇటీవల లాస్‌ వేగాస్‌ నుంచి కొందరు వ్యక్తులు లాస్‌ ఏంజెల్స్‌కు బయల్దేరారు. 

భారత్‌లో అఫ్గాన్‌ ఎంబసీ మూసివేత

ప్రయాణం మొదలుపెట్టగానే గూగుల్‌ నావిగేషన్‌ను వ్యవస్థ వారికి ఓ షార్ట్‌కట్‌ను ఆఫర్‌ చేసింది. ఈ మార్గంలో వెళితే 50 నిమిషాల ప్రయాణం కలిసొస్తుందని పేర్కొంది. పైగా ఇది సురక్షితమైన మార్గమని చెప్పింది. దీంతో షెల్బీ బృందం ఆ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకొంది. ఆ మ్యాప్‌ చూపిన మార్గంలో ప్రయాణించగా.. చివరికి చిక్కటి నెవాడా ఎడారిలోకి వారిని తీసుకెళ్లి వదిలింది. వీరి వాహనాలు ఓ ఇసుక రోడ్డులో కూరుకుపోయాయి. 

వాస్తవానికి వీరు ఓ బురద మార్గంలో నుంచి పర్వతంపైకి వెళుతుండగా ఓ ట్రక్కు డ్రైవర్‌ ఎదురై.. అటువైపు రోడ్డు లేదని చెప్పాడు. కానీ, గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకోవడంతో వీరు ముందుకెళ్లి ఇసుక దారిలో ఇరుక్కుపోయారు. దీంతో ఆందోళన చెంది కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌కు ఫోన్‌ చేశారు. కానీ, సాయం అందలేదు. చివరికి ఒక టోయింగ్‌ ట్రక్కుకు కాల్‌ చేశారు. అది వీరున్న ప్రాంతానికి వచ్చి వాహనాలను బయటకు లాగి తీసుకెళ్లింది. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించిందని న్యూయార్క్‌ పోస్టు కథనంలో పేర్కొంది.

ఇటీవల భారత్‌లో కేరళలో గత నెలలో కొందరు డాక్టర్లు గూగుల్‌ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్‌ చేయడంతో కారు నదిలో మునిగి పోయింది. దీంతో ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు. వీరు మ్యాప్‌లను అనుసరించి నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించి.. కారును నేరుగా పెరియార్‌ నదిలోకి తీసుకెళ్లారు. స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని