నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్‌ దిగ్భ్రాంతి

స్పెయిన్‌లోని ఓ నగరంలో కొంతమంది బాలికల నగ్న చిత్రాలు (Morphed Images) నెట్టింట్లో వైరల్‌గా మారడం సంచలనం రేపుతోంది.

Published : 25 Sep 2023 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ సాంకేతికతను (Artificial Intelligence) ప్రపంచ దేశాలు అందిపుచ్చుకుంటున్న వేళ.. దాని దుర్వినియోగం పర్యవసానాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా స్పెయిన్‌లోని ఓ నగరంలో కొంతమంది బాలికల నగ్న చిత్రాలు (Morphed Images) నెట్టింట్లో వైరల్‌గా మారడం సంచలనం రేపుతోంది. ఊహించని ఈ పరిణామంతో ఆ అమ్మాయిల తల్లిదండ్రులతోపాటు దేశ ప్రజలూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే.. ఇదంతా కృత్రిమ మేధ సాంకేతికతతో (AI) సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.

స్పెయిన్‌లోని ఆల్మెండ్రలెజో నగరానికి చెందిన కొంతమంది యుక్త వయసు అమ్మాయిల నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. 11 నుంచి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్‌లో వైరల్‌ కావడం చూసి అంతా కంగుతిన్నారు. ఇందులో పాఠశాల విద్యార్థులూ ఉన్నారు. ఇలా 20 నుంచి 30 మందికిపైగా బాధితుల తల్లులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, ఫిర్యాదు చేశారు.

Khalistani ఉగ్ర కుట్రలు.. మాస్టర్‌ మైండ్‌ ‘పన్నూ’..!

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపిన పోలీసులు.. అవి ఏఐ ఆధారిత ఫొటోలని ప్రాథమికంగా నిర్ధరించారు. సామాజిక మాధ్యమాల్లో బాలికల ఫొటోలు సేకరించి.. యాప్‌ సాయంతో వాటిని మార్ఫింగ్‌ చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో కొందరు తోటి విద్యార్థులే ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే, ఈ ఫొటోలు చూపించి బాధిత అమ్మాయిలను బెదిరించారని.. కొందరు డబ్బులు కూడా డిమాండ్‌ చేసినట్లు గుర్తించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని