Putin: ఉక్రెయిన్‌లో పోరాడే విదేశీయులకు.. రష్యా పౌరసత్వం!

ఉక్రెయిన్‌లో మాస్కో తరఫున పోరాడే విదేశీ పౌరులు రష్యా పౌరసత్వం పొందే అవకాశం కల్పిస్తూ.. దేశాధినేత పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 05 Jan 2024 01:38 IST

మాస్కో: ఉక్రెయిన్‌లో తమ తరఫున పోరాడే విదేశీ పౌరులకు పౌరసత్వం (Russia Citizenship) కల్పించేందుకు రష్యా ముందుకొచ్చింది. దీనికి అనుమతిస్తూ దేశాధినేత పుతిన్‌ (Putin) ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యర్థి దేశంపై చేపట్టిన ‘సైనిక చర్య’కు సంబంధించి కనీసం ఏడాది కాలానికి ఒప్పందం చేసుకున్నవారు దీనికి అర్హులని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తితోపాటు అతడి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులూ రష్యన్ పాస్‌పోర్ట్‌ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మాస్కో మిలిటరీతోపాటు వాగ్నర్‌ వంటి కిరాయి సైన్యాలతో కలిసి పనిచేసిన వారికీ ఈ అవకాశం కల్పించినట్లు సమాచారం.

‘వెంటనే ఆ దేశాన్ని వీడండి’: తమ పౌరులకు ప్రపంచ దేశాల హెచ్చరికలు

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి ఇప్పటికే 22 నెలలు దాటింది. ఇరుదేశాల్లో ఇప్పటికే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దాడులను కొనసాగించేందుకే మొగ్గు చూపుతోన్న రష్యా.. యుద్ధక్షేత్రంలో పోరాడేందుకు విదేశీయులనూ నియమించుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తమ దేశీయులను సైన్యంలోకి తీసుకోవద్దని, ఇప్పటికే విధులు నిర్వర్తిస్తోన్న వారిని తిరిగి స్వదేశానికి పంపించాలని నేపాల్‌ ఇటీవల అభ్యర్థించిన విషయం తెలిసిందే. యుద్ధంలో పాల్గొనేందుకు తమ పౌరులను తరలిస్తున్నారనే అనుమానంతో క్యూబా అధికారులు గతేడాది సెప్టెంబరులో 17 మందిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని