భార్య మృతి తట్టుకోలేక.. గుండె పోటుతో భర్త మృతి
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 06:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్య మృతి తట్టుకోలేక.. గుండె పోటుతో భర్త మృతి


భార్య సుమిత్రతో భర్త నర్సింగ్‌

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: కరోనాతో మృత్యువాత పడిన తన సతీమణి సంఘటనను తట్టుకోలేక ..మూడు రోజులకే భర్త గుండె ఆగిన తీరు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్‌ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన దాసరి సుమిత్ర(58)కు కరోనా సోకడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 11న రాత్రి 9.30 గంటలకు కరీంనగర్‌లోనే మృతి చెందింది. సుమిత్ర మరణ వార్తను భర్త జీర్జించుకోలేకపోయాడు. ఆమె యాదిలోనే దాసరి నర్సింగ్‌(68) ఈ నెల 15న రాత్రి 7.30 గంటలకు గుండె పోటుతో మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరూ లోకాన్ని వీడారు. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే దాసరి నర్సింగ్‌తో పాటు ఆయన సతీమణి సుమిత్ర ఇద్దరు మరణించడం ఆ కుటుంబంలో చీకటిని నింపింది. నర్సింగ్‌కు ముగ్గురు కూతూళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని