హైదరాబాద్‌లో పబ్లిక్‌ వైఫై హాట్‌ స్పాట్లు

ప్రధానాంశాలు

హైదరాబాద్‌లో పబ్లిక్‌ వైఫై హాట్‌ స్పాట్లు

ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో బయటకు వెళ్లిన వ్యక్తి అత్యవసర సమయంలో అంతర్జాలం (ఇంటర్‌నెట్‌) వాడాల్సి వస్తే డాటా లేదన్న బాధ ఇక ఉండదు. జనం అధికంగా ఉండే మూడు వేల ప్రదేశాల్లో యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌ ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తోంది. 45 నిమిషాల పాటు ఉచితంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బుధవారం సాయంత్రం బేగంపేటలోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, మెట్రో సీఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ సీఈవో బాల మల్లాదిలతో కలిసి రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఫై ఏర్పాటుచేసిన పలు ప్రదేశాలో ఉన్న వారితో వీడియో కాలింగ్‌లో మంత్రి మాట్లాడారు. నెట్‌ అవసరాన్ని గుర్తించి తాను అడిగిన ఒక్క మాటతో బాల మల్లాది రూ.కోట్లు ఖర్చుపెట్టి వైఫైని అందుబాటులోకి తెచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్‌ వైఫైగా పేర్కొన్నారు. జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ  డిజిటల్‌ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017లో చేసిన ఆలోచన ఇలా సఫలమవుతోందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్‌ వై-ఫైని నెలకు దాదాపు 3 లక్షల మందికి పైగా వినియోగించుకుంటున్నారని బాల మల్లాది తెలిపారు. వినియోగాన్ని పరిశీలించి, మరికొన్ని రోజుల్లో కొత్తగా మరో 500 వై-ఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని