జనుము సాగుపై సర్కారు దృష్టి

ప్రధానాంశాలు

జనుము సాగుపై సర్కారు దృష్టి

25 వేల ఎకరాల్లో వేయాలని పరిశ్రమలశాఖ ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో  జ్యూట్‌ (జనపనార) పరిశ్రమల ఏర్పాటుకు మూడు ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థలు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో జనుము పంటను పెద్దఎత్తున సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్లోస్టర్‌ లిమిటెడ్‌, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్‌, ఎంబీజీ కమాడిటీస్‌ లిమిటెడ్‌లు రూ. 887 కోట్లతో మూడు భారీ పరిశ్రమలు స్థాపించనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యాసంగిలో 25వేల ఎకరాల్లో జనుము సాగు చేయాలని వ్యవసాయశాఖకు పరిశ్రమలశాఖ  ప్రతిపాదించింది. దీనిపై త్వరలో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ప్రస్తుతం అతి తక్కువ విస్తీర్ణంలో జనుము సాగవుతుంది. అంతర పంటగానే వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జూట్‌ మిల్లులు లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కొత్తగా 3 మిల్లులు రానుండటంతో అందరి దృష్టి ఈపంటపై పడింది. మరి కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ పంటను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది. మొదటి ఏడాది 25 వేల ఎకరాలు..ఆ తర్వాత క్రమేపీ సాగు విస్తీర్ణం పెంచాలని యోచిస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని