తాలిపేరు.. ఎర్రబారినది!

ప్రధానాంశాలు

తాలిపేరు.. ఎర్రబారినది!

లాలన్నీ ఇంతగా ఎర్రబారాయేంటని ఆశ్చర్యపోకండి.. ఇదే ప్రకృతి చిత్రం! ఎర్రనేలల మహత్యం..! కనులకు విందు చేస్తున్న ఈ చిత్రం తాలిపేరు జలాశయం వద్ద తీసినది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉందీ జలాశయం. తాలిపేరు నది ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక దూరం ప్రవహించి, తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. వర్షాలు కురిసినపుడు కొత్తనీరు ఇలా రంగుమారి చూపరులను ఆకర్షిస్తుంది. ఈ నదికి తోడు చింతవాగు నుంచి ఎర్రటి నీరు వస్తుంది. ఈ వాగు పరిసర ప్రాంతాల్లో ఎర్రనేలలు అధికంగా ఉండటంతో వరదనీరు ఇంతలా రంగు మారుతుందని తాలిపేరు ప్రాజెక్టు డీఈ తిరుపతి తెలిపారు.  తాలిపేరు జలాశయం నిండి గేట్లు ఎత్తితే నీరు దిగువన గోదావరిలో కలుస్తుంది.  

- న్యూస్‌టుడే, చర్ల


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని