పిల్లల్లో.. ఆ రెంటినీ పెంచండి!
close
Published : 19/09/2021 18:19 IST

పిల్లల్లో.. ఆ రెంటినీ పెంచండి!

పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి, ఉన్నతంగా నిలవాలని కోరుకోని తల్లిదండ్రులెవరు? ఇవి  సాధ్యమవ్వాలంటే వాళ్లను ఆ దిశగా నడిపించాల్సింది మనమే. అందుకు చేయాల్సిందల్లా వాళ్లలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించడమే.

అదెలాగంటే..

పొగడండి.. చేసిన ప్రతిదాన్నీ మెచ్చుకోవాల్సిన పనిలేదు. కానీ నిజంగా మంచి పని ఏది చేసినా శెభాష్‌ చెప్పాల్సిందే. ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయడం, వస్తువులను చక్కగా ఉంచుకోవడం.. ఇలాంటివి చూసినపుడు సంతోషిస్తారు కదా! దాన్నే వ్యక్తపరచండి. ‘అరె.. భలే ఉంచుకున్నావే’ ‘నువ్విలా ఉంచుకుంటే చూడటం నాకెంత ఇష్టమో’ చిన్న మాటలే! కానీ ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. భవిష్యత్తులో కొనసాగేలానూ చేస్తాయి.

* ‘ఫలానా వాళ్లు చూడు ఎంత బాగా చేస్తున్నారో’, ‘నీకేదీ త్వరగా రాదు’.. కోపంగా అనే మాటలు కావని మనకూ తెలుసు. వాళ్లకు తెలియజెప్పే మార్గంగా ఈ పోలిక చేస్తుంటాం. కానీ ఇవి పిల్లలపై నెగెటివ్‌ ప్రభావాన్ని చూపుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి.. ‘ప్రయత్నించావు కానీ.. ఇంకొంచెం టైమ్‌ కేటాయిస్తే బాగుండేది’, ‘నీకంటే వాళ్లు ఎక్కువ కష్టపడ్డారు. ఈసారి నువ్వూ ప్రయత్నించు’.. ఇలా చెప్పి చూడండి. వాళ్ల ప్రయత్నాన్ని గమనించినట్టు భావించడంతోపాటు ఇంకొంచెం శ్రమించడానికి ప్రయత్నిస్తారు. సానుకూల ఆలోచనా విధానమూ అభివృద్ధి చెందుతుంది.

* పిల్లలు లోకంలో అందరి కంటే అమ్మానాన్నల మెప్పును ఎక్కువ ఆస్వాదిస్తారు. కాబట్టి, ఇది చెయ్యి అని ఆజ్ఞలా కాకుండా.. ఫలానా చేస్తే నచ్చుతావు, నేను నీ నుంచి కోరుకునేదిదీ అని స్పష్టంగా చెప్పి చూడండి. వాళ్లు చేయకపోవడానికి కారణాన్ని తెలుసుకోండి. సబబుగా అనిపిస్తే సరే.. లేదంటే సర్దిచెప్పండి. విషయమేదైనా వాళ్లు మీతో చర్చించే అవకాశాన్నివ్వండి. తన అభిప్రాయానికి విలువనిస్తున్నట్టు భావిస్తారు. అంతేకాదు.. వారిలో నిర్ణయం తీసుకునే నైపుణ్యాన్నీ నేర్పినవారవుతారు.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని