కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..! - simple steps to being a happier couple in telugu
close
Published : 12/07/2021 17:55 IST

కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!

దంపతులిద్దరూ జీవితాంతం ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ, ఒకరి మనసులో మరొకరు నిండిపోతూ, ఒకరి వూపిరి మరొకరై ముందుకు సాగుతుంటే.. ఆ బంధం ఎప్పటికీ నిత్యనూతనమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడం మాత్రమే కాదు.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం, ఒకరికి బాధ కలిగితే మరొకరు 'నేనున్నా'నంటూ ఓదార్చడం... మీదైన ప్రత్యేక శైలిలో సర్‌ప్రైజ్ చేయడం.. వంటివి కూడా ముఖ్యమే. అయితే వీటికి కాస్త రొమాన్స్‌ కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి ఆకాశపుటంచుల్ని తాకుతుంది.

ఐ లవ్యూ.. చెబుతున్నారా??

'ఐ లవ్యూ..' ఇది కేవలం ప్రేమికులు మాత్రమే కాదు.. భార్యాభర్తలు కూడా చెప్పుకోవాల్సిన మాట. అయితే ఇలా చెప్పుకోకపోతే ప్రేమ లేదని మా ఉద్దేశం కాదు. అలాగని రోజూ చెప్పినా బోర్ కొడుతుంది కూడా! అందుకే అప్పుడప్పుడు విభిన్న రీతుల్లో ఐలవ్యూ చెప్పడానికి ప్రయత్నించండి. ఇలా మీ మనసులోని ప్రేమను వ్యక్తం చేయడానికి కొన్ని ప్రత్యేక సందర్భాలు కూడా ఉన్నాయండోయ్! ఉదాహరణకు.. వాలెంటైన్స్ డే, పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మీ భాగస్వామికి నచ్చిన మంచి కానుక కొని.. దాన్ని ఇస్తూ ఈ మాట చెబితే.. మరింత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.

కాసేపైనా నవ్వుకోండి..

ఓ నవ్వు జీవితంలోని బాధల్ని మరిపిస్తుంది.. అలాగే భార్యాభర్తల మనసుల్ని కూడా మరింతగా దగ్గర చేస్తుంది. కాబట్టి ఖాళీ సమయాల్లో దంపతులిద్దరూ కలిసి అనవసర విషయాలతో కాలక్షేపం చేయకుండా జోక్స్, నవ్వు తెప్పించే చిన్నప్పటి సంగతులు.. వంటివి పంచుకోవాలి. అలాగే ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి కాసేపు అలా ఒకరి నడుంపై మరొకరు చెయ్యేసి.. అప్పుడప్పుడూ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ఓరగా నవ్వుతూ, చేతిలో చెయ్యేసి కాసేపు నడుస్తూ.. రొమాంటిక్‌ వాక్‌ చేయడం మంచిది. అలాగే సమయం దొరికినప్పుడైనా ఇద్దరూ కలిసి తమకు నచ్చిన కామెడీ, రొమాంటిక్ సినిమాలు చూస్తుండాలి. ఇలా వీలైనప్పుడల్లా దంపతులిద్దరూ కలిసి రొమాంటిక్‌గా గడపడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

అందంగా.. ఆకర్షణీయంగా..

దంపతులిద్దరూ రోజూ ఎవరి పనులతో వారు బిజీగా ఉంటారు. ఒకరినొకరు పట్టించుకునే తీరికే ఉండకపోవచ్చు.. అయితే కనీసం సెలవు రోజునో.. అలా బయటకు వెళ్ళినప్పుడో.. లేదంటే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాలప్పుడో.. అందంగా ముస్తాబు కావడం చాలా అవసరం. ఫలితంగా ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఈ క్రమంలో మీ భాగస్వామిపై మీకున్న ఫీలింగ్‌ని మీ మనసులోనే దాచుకోకుండా వారితో చెప్పేయాలి. దగ్గరికి తీసుకుని, లేదంటే నుదుటిపై ఓ ముద్దు పెడుతూ, అదీకాదంటే గుండెలకు హత్తుకొనైనా ఇలా రొమాంటిక్‌గా వ్యక్తం చేయాలి.. 'నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావ్! నీ వల్ల చీరకే అందం వచ్చింది తెలుసా..' -అనో; 'మీరు ఈ డ్రస్సులో మన్మథుడిలా ఉన్నారు..' అనో చెబితే ఎదుటివారు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ హద్దులు దాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏమంటారు?

కాస్త రాజీ పడితే పోలా?

ఏ బంధమైనా కలతలు లేకుండా కలకాలం కొనసాగాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడడం, సర్దుకుపోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల విషయంలోనూ అంతే.. అన్ని విషయాల్ని సీరియస్‌గా తీసుకోకుండా కొన్నింటిలో ఎవరో ఒకరు సర్దుకుపోతుండడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. అయితే ఎప్పుడూ ఒక్కరే సర్దుకుపోవడం కాకుండా.. సందర్భాన్ని బట్టి ఓసారి భార్య, ఓసారి భర్త.. ఇలా ఇద్దరూ సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని