ఈ కలర్‌ఫుల్ చపాతీలు ఆరోగ్యానికి ఎంత మంచివో! - try these colorful chapatis without artificial flavors in telugu
close
Updated : 21/06/2021 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ కలర్‌ఫుల్ చపాతీలు ఆరోగ్యానికి ఎంత మంచివో!

ఈమధ్య కాలంలో చాలామంది తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, బరువు తగ్గేందుకు ఎక్కువగా చపాతీలనే తింటున్నారు. వీరితో పాటు స్థూలకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు అన్నం బదులు చపాతీలనే తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే ఎవరికైనా ఎప్పుడూ ఒకే ఆహారాన్ని తినడం కొంచెం విసుగ్గానే ఉంటుంది. ఈ క్రమంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపించడం సహజం.

రంగు రంగుల చపాతీలు!

గోధుమ, రాగి, జొన్న, సజ్జలు... ఇలా ఏ పిండితో చేసినా చపాతీలు లేత గోధుమ రంగులోనే ఉంటాయి. అయితే ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో చపాతీలు తయారుచేయడం ఎప్పుడైనా చూశారా? అది కూడా ఎలాంటి కృత్రిమ రంగులు కలపకుండానే! అయితే ఓ సారి ట్రై చేద్దాం రండి. 

కావాల్సిన పదార్థాలు

* అరకప్పు- పిండి (గోధుమ, రాగి, జొన్న, సజ్జలు మొదలైనవి) 
* అరకప్పు - బీట్‌రూట్‌ ప్యూరీ (లేదా) పాలకూర ప్యూరీ

తయారీ విధానం

ఉడకబెట్టిన బీట్‌రూట్‌ ముక్కలు లేదా పాలకూరను మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో చపాతీ పిండిని తీసుకుని అందులోకి బీట్‌రూట్‌ లేదా పాలకూర ప్యూరీ వేసి బాగా కలపాలి. బీట్‌రూట్‌ ప్యూరీ కలిపిన పిండి ఎరుపు రంగులోకి మారితే... పాలకూర ప్యూరీ కలిపిన పిండి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇక ఎప్పటిలాగే ఆ పిండిని చపాతీ ముద్దల్లా తయారుచేసుకుని పెనంపై కాల్చితే సరి... రంగు రంగుల చపాతీలు రడీ..! నెయ్యి వాడడం ఇబ్బంది లేదనుకునేవారు కొద్దిగా నెయ్యి వేసి కాల్చితే మహా రుచిగా ఉంటాయి. వీటిని ఏదైనా సబ్జీతో కలిపి తినవచ్చు.

 

ఆరోగ్య ప్రయోజనాలు!

* కృత్రిమ రంగులు ఉపయోగించకుండా తయారుచేసే ఈ రంగు రంగుల చపాతీలను పిల్లలు ఇష్టపడి తినే అవకాశం ఉంటుంది.
* చపాతీల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంగా చేర్చుకోవడం వల్ల మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
* ఊబకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.
* జ్యూస్‌, సూప్‌, సలాడ్... ఇలా ఏ రూపంలో తీసుకున్నా మేలు చేస్తుంది బీట్‌రూట్‌. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 
* బీట్రూట్‌లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, విటమిన్లు-ఎ, సి ఎదిగే పిల్లలకు బాగా తోడ్పడతాయి. వారి మెదడును చురుకుగా ఉంచి, జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. 
* రక్తప్రసరణ మెరుగ్గా ఉన్నప్పుడు ఎలాంటి గుండె సమస్యలు దరిచేరవు. ఈ విషయంలో బీట్‌రూట్‌కి మించింది లేదు. 
* ఇక పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. 
* శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పాలకూర బాగా సహకరిస్తుంది.
* అధిక బరువు, టైప్‌-2 డయాబెటిస్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల్ని బలంగా ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 

బీట్‌రూట్‌, పాలకూరలను ఉపయోగించి తయారుచేసే రంగురంగుల చపాతీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారుగా... మరి మీరు కూడా వీటిని ట్రై చేయండి. 
అలాగే - చపాతీలను మరింత వెరైటీగా, రుచికరంగా తయారు చేసే మరిన్ని పద్ధతుల గురించి మీకు తెలిసినట్లయితే మాతో పంచుకోండి!


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని