Karnataka: అమూల్‌ vs నందిని.. కర్ణాటకలో రాజకీయ దుమారం

శాసనసభ ఎన్నికల వేళ కర్ణాటక (Karnataka)లో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పాల సమాఖ్య (KMF) ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా.. గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ (Amul)కు అవకాశం కల్పించడం రాష్ట్రంలో రాజకీయంగా పెను దుమారం రేపింది. దీంతో నందిని బ్రాండ్ పాల (Nandhi Milk Packets)కు బెంగళూరు హోటల్ యజమానుల సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఇకపై తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. మరోవైపు బొమ్మై సర్కార్ తీసుకున్న నిర్ణయం... కర్ణాటకలో పాడి పరిశ్రమపై ఆధారపడిన 28 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతోందని.. JDS సహా కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

Published : 09 Apr 2023 16:12 IST

Tags :

మరిన్ని