GT vs CSK: చెపాక్‌లో చెన్నై చమక్‌.. గెలుపు సంబరాలు చూశారా..?

చెన్నై: కీలక పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ను నాలుగు సార్లు విజేత అయిన చెన్నై సూపర్‌ కింగ్ మట్టికరిపించింది. దీంతో సీఎస్కే ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లో గుజరాత్‌పై ఓడిపోయిన చెన్నై కీలక పోరులో మాత్రం అదరగొట్టింది. ఈ విజయంతో పదోసారి చెన్నై ఫైనల్‌లో అడుగపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌(60), కాన్వే(40) రాణించారు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో చెన్నై 15 పరుగుల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. శుభ్‌మన్‌ గిల్‌(42), రషీద్‌ ఖాన్‌(30) పోరాడినా గుజరాత్‌ను గెలిపించలేకపోయారు. చివరి ఓవర్‌లో గుజరాత్‌ విజయానికి 27 పరుగులు అవసరం కాగా కేవలం 11 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై శిబిరంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సొంత మైదానంలో పసుపు రంగు జెర్సీలు రెపరెపలాడాయి. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి మరి..    

Updated : 24 May 2023 01:11 IST

Tags :

మరిన్ని