GT vs CSK: చివరి బంతి గాల్లోకి.. అసాధారణ రీతిలో క్యాచ్‌ పట్టిన చాహర్‌

చెన్నై: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌ ఇస్తూ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ ఛేదించలేపోయింది. 20 ఓవర్లలో ఆ జట్టు 157 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. దీంతో చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి మూడు ఓవర్లలో గుజరాత్‌ విజయానికి 39 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్‌ వేసిన పతిరన రెండు వికెట్లు తీసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్‌లో ఒక వికెట్‌ పడడంతో పాటు 8 పరుగులే వచ్చాయి. దీంతో చెన్నై విజయం దాదాపుగా ఖరారైంది. ఇక చివరి ఓవర్‌లో 27 పరుగులు చేయాల్సి ఉండగా పతిరన 11 పరుగులే ఇచ్చాడు. చివరి బంతిని షమీ గాల్లోకి లేపగా దీపక్‌ చాహర్‌ పరుగెడుతూ అసాధారణ రీతిలో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో చెన్నై జట్టులో ఆనందం వెల్లివిరిసింది. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి మరి..  

Updated : 24 May 2023 05:24 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు