Kotamreddy: ఏంటీ దాదాగిరి? ప్లకార్డు చించేశారు.. అడిగితే సస్పెండ్‌ చేశారు: కోటంరెడ్డి

అసెంబ్లీలో తన పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ చరిత్రలో ఈ ఘటనను నల్ల అక్షరాలతో లిఖించాలన్నారు. తాను ఎక్కడా సభ కార్యకలాపాలకు అడ్డు తగలలేదన్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తామంటే అవకాశం ఇవ్వకుండా.. తనను తిట్టడానికి ఇద్దరు మంత్రులకు స్పీకర్ సమయం ఇచ్చారన్నారు. తెదేపా సభ్యుల సస్పెషన్ తర్వాత తన ప్లకార్డు లాక్కొని చించేశారన్నారు. ఇదేం దాదాగిరి? అని అడిగితే స్పీకర్ తననూ సస్పెండ్ చేశారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేసే రోజు దగ్గర్లోనే ఉందని కోటంరెడ్డి దుయ్యబట్టారు. 

Updated : 15 Mar 2023 19:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు