Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
డొంక కదులుతోంది
ఉపాధ్యాయుల నకిలీ వైద్య బిల్లుల కేసులో పలు సందేహాలు
పాఠశాల కమిషనర్‌ వివరణకు ప్రభుత్వ నిర్ణయం
విద్యామంత్రికి చేరిన దస్త్రం
ఈనాడు, హైదరాబాద్‌: విద్యాశాఖ మంత్రి సొంత జిల్లా నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కదలిన ఉపాధ్యాయుల నకిలీ వైద్య బిల్లుల కేసు తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో వెలుగుచూస్తున్న విషయాల్ని చూసి ప్రభుత్వమే విస్తుపోతోంది. ఒకదానివెంట ఒకటిగా జరిగిన తప్పుల్ని, అవినీతికి పాల్పడ్డ ఉపాధ్యాయుల్ని రక్షించటానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తుంటే పాఠశాల విద్యాశాఖ కార్యాలయ పాత్రపైనా అనుమానాలు రేగుతున్నాయి. ఈ కేసు విషయమై ఏకంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను వివరణ కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన దస్త్రం విద్యామంత్రికి చేరినట్లు సమాచారం. అవినీతికి పాల్పడిన ఉపాధ్యాయుల్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఈ కుంభకోణంపై మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందలమంది ఉపాధ్యాయులు నకిలీ వైద్య బిల్లులు సమర్పించి ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకున్నారు. కొందరైతే ఒకే బిల్లుతో రెండు మూడుసార్లు కూడా డబ్బులు తీసుకున్నట్లు తేలింది. ఇందులో కొంతమంది ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలు తేలిన వారిపై క్రిమినల్‌ కేసులతో పాటు విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అవన్నీ ఇంకా నడుస్తున్నాయి. చాలామంది ఉపాధ్యాయులు అవినీతిని అంగీకరించి డబ్బులు తిరిగి చెల్లించారు. డబ్బులు కట్టేశారు కాబట్టి కేసులు ఎత్తివేయాలని, సస్పెన్షన్‌ను తొలగించాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలు ఒత్తిడి తెచ్చారు. దీంతో సస్పెన్షన్‌ను మాత్రమే ఎత్తివేసి, కేసుల్ని యథాతథంగా ఉంచారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా తేలిన ఉపాధ్యాయులకు మూడు ఇంక్రిమెంట్లు ఆపివేయాలని గతేడాది పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నుంచి అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలందాయి. దాన్ని సాకుగా చూపిస్తూ నల్గొండ డీఈవో ఈ మధ్య ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ కాలాన్ని ‘‘డైస్‌నాన్‌’’గా ప్రకటిస్తూ (ఒకరకంగా క్రమబద్ధీకరిస్తూ) ఆదేశాలిచ్చారు. ఈ అధికారం డీఈవోకు లేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే తనకా అధికారం ఉందనీ.. ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్లను నిలపటానికే ఈ చర్య అని డీఈవో బహిరంగంగానే ప్రభుత్వంతో విభేదించారు.

కేసు నడుస్తుండగా ఆదేశాలిస్తారా
దీనిపై పాఠశాల విద్య కమిషనర్‌ను నివేదిక కోరటంతోపాటు ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. మరోవైపు అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నామంటూ, ఉద్యోగవిరమణ పొందిన వారి విషయంలో ఏం చేయాలో చెప్పాలని పాఠశాల కమిషనర్‌ ఇటీవల ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం గట్టిగానే స్పందించినట్లు సమాచారం. అసలు తప్పుచేసినట్లు అంగీకరించిన ఉపాధ్యాయులు ఎంత మందిపై ఏ రకమైన చర్యలు తీసుకున్నారు; క్రిమినల్‌ కేసులు నడుస్తుండగా వారి ఇంక్రిమెంట్లు నిలిపివేయాలంటూ ఆదేశాలెలా ఇచ్చారంటూ పాఠశాల కమిషనర్‌ను ప్రభుత్వం అడిగినట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆదేశాలు జారీ చేయటం, ఇచ్చిన ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ పాటించకపోవటం, డీఈవో సైతం ప్రభుత్వంతో విభేదించటం, అయినా పాఠశాల కమిషనర్‌ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవటం.. వీటన్నింటి నేపథ్యంలో ఈ విషయంలో మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net