Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
ఆక్రమణలకు రక్షణ
గట్లను ఆక్రమిస్తూ వెలసిన నిర్మాణాలకు రక్షణ గోడలు
రంగం సిద్ధం చేస్తున్న నీటిపారుదల శాఖ
ఈనాడు, హైదరాబాద్‌: నది గట్లు, కాలువల గట్లను ఆక్రమించి పక్కా భవనాలు నిర్మించుకొన్నారు. వీరిని ఖాళీ చేయించడం సాధ్యమయ్యే పని కాదు. వీరిని ఖాళీ చేయించి లైనింగ్‌ పనులు చేయడం కుదరదు కాబట్టి, ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలకు రక్షణగా సిమెంటు గోడలు నిర్మించడానికి నీటిపారుదల శాఖ సిద్ధమైంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేయనుంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఈ పనులకు వీలైనంత త్వరగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకచోట.. ఈపీసీలో ఒప్పందం చేసుకొని 75 శాతం పని పూర్తి చేసి మిగిలిన పనిని ఆక్రమణల కారణంగా చేయలేమని గుత్తేదారులు అన్నారని రద్దు చేశారు. ఆ పనికి అంచనా వ్యయాన్ని నాలుగురెట్లు పెంచి టెండర్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇంకోచోట ఈపీసీ పద్ధతిలో టెండర్‌ పిలిస్తే ఎన్నికలలోపు టెండర్‌ ప్రక్రియ పూర్తికాదు కాబట్టి నాన్‌ ఈపీసీ కింద చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు పనుల విలువ రూ.200 కోట్లకు పైనే కావడం గమనార్హం. నెల్లూరు వద్ద సర్వేపల్లి కాలువ, కృష్ణపట్నం ఛానల్‌, జాపర్‌ సాహెబ్‌ కాలువలకు సంబంధించి ఆధునికీకరణ, లైనింగ్‌ పనులను రూ.80.40 కోట్లతో జి.ఎస్‌.ఆర్‌ అండ్‌ కంపెనీ దక్కించుకొంది. అంచనాపై 4.57 శాతం ఎక్కువకు ఈ సంస్థకు పని దక్కింది. ఒప్పందం ప్రకారం 2010 ఏప్రిల్‌ నాటికి పని పూర్తి చేయాల్సి ఉంది. పూర్తి కాకపోవడంతో 2012 సెప్టెంబరు ఆఖరు వరకు గడువు పొడిగించారు. మొత్తమ్మీద సుమారు రూ.60 కోట్ల పని మాత్రమే జరిగింది. కాలువల ఆధునికీకరణ పనులు నెల్లూరు పట్టణంలో కూడా చేయాల్సి ఉందని, అయితే కాలువ భూములను ఆక్రమించుకొని పక్కా నివాస భవనాలు, వాణిజ్య భవనాలను గట్టుకు రెండువైపులా నిర్మించారని, వీటిని తొలగించకుండా పనులు చేయడం సాధ్యం కాదని గుత్తేదారు నివేదించారు. ఈ భవనాలను తొలగించడం సాధ్యం కాదని కూడా తేల్చారు. ఈపీసీ కింద టెండర్‌ పిలిచినపుడు గుత్తేదారు ఇన్వెస్టిగేషన్‌ చేసినపుడే ఈ సమస్య తెలియాల్సి ఉంది. ఒప్పందం చేసుకొన్న నాలుగేళ్ల తర్వాత, అదీ 75 శాతం పని జరిగిన తర్వాత ఈ సమస్యను ప్రస్తావించారు. దీంతో కాలువ ఆధునికీకరణ చేయకుండా, అక్రమణల జోలికి వెళ్లకుండా కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. అంచనాలో పేర్కొన్న సిమెంటు లైనింగ్‌ పనిని పాత గుత్తేదారు నుంచి తొలగించి రెండువైపులా సిమెంటుగోడ నిర్మించాలని నిర్ణయించారు. ఆక్రమణలకు రక్షణగా సిమెంటు గోడలను నిర్మిస్తారు. ఈ పనికి రూ.105.21 కోట్లతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99.95 కోట్ల అంచనాతో టెండర్లు పిలవనున్నారు. అనేక ప్యాకేజీల్లో గుత్తేదారులకు ప్రభుత్వం ఇలానే సహాయపడుతోంది. నిబంధనల ప్రకారం పని చేయని గుత్తేదారుపై సెక్షన్‌ 61 కింద చర్య తీసుకోకుండా, సెక్షన్‌ 60.సి కింద పాక్షికంగా తొలగించడం, ఇదే పనికి అంచనాలు భారీగా పెరిగి మళ్లీ టెండర్లు పిలవడం మామూలై పోయింది. కొందరు గుత్తేదారులకు, ప్రజాప్రతినిధులకు ఇది డబుల్‌ ధమాకాలా తయ్యారైంది. ఇలా జరిగిన చోట పాత గుత్తేదారే ఇంకోపేరుతో పని దక్కించుకొంటున్నారు. ఉత్తరాంధ్రలో ఓ పనిని ఇలానే తొలగించి ఇంకో గుత్తేదారుకు అప్పగించారు. అధికారికంగా ఇద్దరు గుత్తేదారులు వేరయినా, అనధికారికంగా ఒకటే. అయితే ఈ రెండు సంస్థలు పని చేయలేదు కానీ, 25 శాతం కమీషన్‌తో ఇంకో గుత్తేదారుకు అప్పగించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈపీసీ ఒప్పందంలోని సెక్షన్‌ 60.సి కింద తొలగించిన వాటిలో ఎక్కువ పనులకు ఇలాగే జరుగుతోందని నీటిపారుదల శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. విజయవాడ వద్ద కృష్ణానదికి ఎడమవైపున వరద రక్షణ గోడను నిర్మించడానికి కూడా టెండర్‌ పిలవనున్నారు. రామలింగేశ్వర్‌ నగర్‌ వద్ద నిర్మించే రక్షణ గోడకు రూ.105 కోట్లు వ్యయమవువుతుందని అంచనావేశారు. విజయవాడలో ఆక్రమణలది పెద్దసమస్య. ఈ పనిని వెంటనే చేపట్టాలని, ఈపీసీ కింద చేపడితే జాప్యం జరుగుతుంది కాబట్టి నాన్‌ ఈపీసీ కింద టెండర్‌ ప్రక్రియ చేపట్టడానికి అనుమతించాలని సంబంధిత ఇంజినీర్లు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల్లోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఈ ప్రతిపాదన ముందుకొచ్చినట్లు తెలిసింది.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net