Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
‘చిన్న’తనం!
చిన్నతరహా పరిశ్రమల్లో..రాష్ట్రంలో మిగిలినవి 45 వేలే
దేశంలో పదకొండో స్థానం
జాతీయ గణనలో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌
సంక్షోభాలు, సమస్యల కారణంగా రాష్ట్రంలో చిన్న పరిశ్రమల సంఖ్య తగ్గుతోంది. రాష్ట్రంలో చివరికి 45,962 చిన్న పరిశ్రమలు మాత్రమే మిగిలాయి. రాష్ట్రం ఈ రంగంలో దేశంలో పదకొండో స్థానానికి దిగజారినట్లు అఖిల భారత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గణాంకాలు వెల్లడించాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. విద్యుత్తు కోతలు, ఛార్జీల పెంపుదల వంటివాటి వల్ల ఏర్పడిన పర్యవసానాలతో చిన్నతరహా పరిశ్రమలు పెద్దఎత్తున మూతపడుతున్నాయి. ఉత్పత్తులు, వాటితోపాటే పెట్టుబడులు తగ్గిపోయాయి. కార్మికుల ఉపాధికి గండిపడింది. పరిశ్రమల మూత ప్రభావం గణనీయంగా ఉన్నట్లు తాజాగణనలో తేలింది. రాష్ట్రంలో 45,962 పరిశ్రమలు ఉండగా వాటిపై రూ.11,752 కోట్ల మేరకు పెట్టుబడులున్నాయి. వీటిల్లోని యంత్రాల విలువ రూ.3641 కోట్లుగా ఉంది. ఈ పరిశ్రమల ద్వారా 3,82,977 మంది ఉపాధి పొందుతున్నారని గణాంకాలు వెల్లడించాయి. అయిదేళ్ల క్రితం రాష్ట్రంలో 80 వేలకు పైగా పరిశ్రమలు ఉండగా ఎనిమిది లక్షల మంది వరకు ఉపాధి పొందేవారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం అయిదో స్థానంలో ఉండేది. ఆ తర్వాత పారిశ్రామిక రంగం రూపురేఖలు మారిపోయాయి.

ఇతర రాష్ట్రాల్లో పురోగమనం: మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చిన్నతరహా పరిశ్రమలు పురోగమిస్తున్నాయి. తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బీహార్‌ పంజాబ్‌ రాష్ట్రాలు ఏపీ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఉపాధిలోనూ ముందున్నాయి. పెట్టుబడులూ వాటిలో అధికమే. పారిశ్రామిక పతనాన్ని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి. కోతవల్ల రోజుకు 72 పరిశ్రమలు మూతపడ్డట్లు భారతీయ రిజర్వు బ్యాంకు నివేదిక ఇటీవలే వెల్లడించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ సైతం పరిశ్రమల గడ్డు పరిస్థితులపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net