Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


రామాయణ పారాయణ - పూజా మహత్వం
శ్రీరామ చంద్రుడు దేవుడిగా పూజలందుకోవటం మామూలే. అయితే ఆయన చరితమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ గ్రంథం పూజలందుకోవటం విశేషం. ఈనాటికీ చాలా మంది తమ దేవతా మందిరాలలో రామాయణ గ్రంథాన్ని ఉంచి భక్తితో పూజలు చేస్తుంటారు. ఇలా ఓ గ్రంథం పూజలందుకోవటం వెనుక కారణమేమిటి? అనే ప్రశ్నకు స్కంద పురాణాంతర్గతంగా ఉన్న శ్రీమద్రామాయణ మహాత్మ్యం అనే అధ్యాయం వివరణ ఇస్తోంది.

గంగలాగా పవిత్రమైన తీర్థం కానీ, తల్లితో సమానమైన గురువుకానీ, విష్ణు సమానుడైన దైవంకానీ, రామాయణం కంటే పవిత్రమైన గ్రంథం కానీ లేవు. వేదం వంటి శాస్త్రం, శాంతిని మించిన సుఖం, సూర్య కిరణాలతో సమానమైన కాంతి మండలం, రామాయణానికి సాటిరాగల ఉదాత్తకావ్యం ఈ లోకంలో లేనే లేవు. సహనమే అన్నింటిని మించిన బలం. కీర్తి ఒక్కటే నిరుపమానమైన సంపద, జ్ఞానమే అపూర్వమైన పెన్నిధి, శ్రీమద్రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యం అని రామాయణ మహాకావ్యాన్ని గురించి నారద మహర్షి సనత్కుమారుడికి స్కంద పురాణంలో వివరించి చెప్పాడు. రామాయణ మహాకావ్యంలో కనిపించేది కేవలం శ్రీరామచంద్రుడి చరిత మాత్రమే కాదు అందులోని అక్షరాక్షరం అనంత మంత్ర శక్తి నిక్షేపం. అంతటి శక్తి నిండిన కావ్యం కనుకనే రామాయణం పూజలందుకోగలుగుతోంది. దాన్ని చదివినా, విన్నా, పూజలో దర్శించినా పుణ్యఫలమే దక్కుతుంది.

రామాయణానికి ఎలా పూజ చేయాలి? ఎప్పుడు పారాయణం చేయటం మంచిది అనే విషయాల గురించి నారదుడే సనత్కుమార మహర్షికి ఇలా తెలియచెప్పాడు.

రామాయణ పారాయణకు ఒక విధి విధానం ఉంది. ఆ విధానం ప్రకారం రామాయణ కథా శ్రవణం కానీ, పఠనంకానీ భక్తి శ్రద్ధలతో చేస్తే మోక్షమే కలుగుతుంది. ఈ అనుష్టానాన్ని చైత్రమాసంలోకానీ, కార్తీకమాసంలో కానీ, మాఘమాసంలో కానీ, శుక్ల పక్ష పంచమి నుంచి తొమ్మిది రోజులపాటు దీక్షతో రామాయణ పారాయణ చేయాలి. పారాయణను ప్రారంభించేటప్పుడు శ్రీరామ ప్రార్థన చేయాలి. ‘ఓ రామా నేటి నుంచి నీ కథను భక్తి శ్రద్ధలతో వింటాను (లేదా పఠిస్తాను). రామాయణ పారాయణ కథ శ్రవణ పూర్వకమైన నవరాత్ర దీక్ష నిర్విఘ్నంగా నెరవేరేలాగా నన్ను అనుగ్రహించు’ అని ప్రార్ధించాలి. ఆ తర్వాత ప్రతిరోజూ ఉషోదయంలోనే మేల్కొని ఉత్తరేణు చెట్టు పుల్లలతో దంత శుద్ధి చేసుకొని స్నానాదికాలు ముగించి బంధుమిత్రులతో కలిసి రామాయణ పారాయణకు ఉపక్రమించాలి. ప్రతిరోజూ ఇలా పవిత్రంగా భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉండాలి. నిత్యం దేవతార్చన ముగించి సంకల్ప పూర్వకంగా శ్రీమద్రామయణ గ్రంథాన్ని పూజించాలి. ఆవాహన, ఆసన, అభిషేక, గంధ పుష్పాదులతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ స్వామికి భక్తితో షోడశోపచారాలు జరపాలి. శక్తి ఉన్నవారు పూజలకు అనుబంధంగా హోమ కార్యాలను చేయాలి. ఇలా చేసే హోమం పాపాలను హరిస్తుంది. రామాయణ పూజ, పారాయణలను దీక్షతో చేసే రోజుల్లో స్వార్థపరులు, పాపాత్ములు, అధర్మ మార్గాన్ని అనుసరించే వారిని దూరంగా ఉంచాలి. ఇలా చేసినప్పుడే రామాయణ పారాయణ, పూజా ఫలితాలు సంపూర్ణంగా దక్కుతాయి. ఇంద్రియ నిగ్రహాన్ని వహించి వ్రత దీక్షతో రెండుసార్లు రామకథా శ్రవణం చేసినవారికి పుండరీకయాగం చేసిన ఫలం చేకూరుతుంది. నాలుగుసార్లు కథా శ్రవణం చేస్తే రెండుసార్లు అశ్వమేథ యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. ఐదుసార్లు వింటే అగ్నిష్టోమయాగ ఫలానికి ఎనిమిది రెట్ల పుణ్యఫలం చేకూరుతుంది. ఆరుసార్లు వింటే రెండు పర్యాయాలు అత్యగ్నిష్టోమ యజ్ఞం ఆచరించిన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏడుసార్లు శ్రవణం చేస్తే ఎనిమిదిసార్లు అగ్నిష్ఠోమం చేసినంత పుణ్యమే దక్కుతుంది. స్త్రీలైనా, పురుషులు ఎవరైనా సరే ఎనిమిది సార్లు రామకథ వింటే అశ్వమేథ ఫలానికి ఎనిమిది రెట్ల ఫలం లభిస్తుంది. నవరాత్ర దీక్షతో రామాయణ పారాయణ నిర్వహించే వారికి అశ్వమేథ యజ్ఞానికి అయిదురెట్ల ఫలం లభిస్తుంది. దీంతో పాటు ఈ రామాయణ వ్రతాన్ని చేసిన వారికి గోమేధ ఫలం దక్కుతుంది. గోమేధం ఎంతో పవిత్రమైన యజ్ఞం. గోమాతను పక్కన చేర్చుకొని విధి విధానంగా హోమకార్యాలను నిర్వర్తించి ఆ గోవును పూజించి మంచి వేద పండితుడికి దానం ఇవ్వాలి. దాన్ని తీసుకొనే పండితుడు గోసేవ చేసే వాడై ఉండాలి. అలా ఒక్క గోవును దానం చేసి ­రుకోక ఆ గోవుకు జీవితాంతం పోషణకు కావాల్సిన ద్రవ్యాన్ని ఏర్పాటు చేయాలి. అలా కుదరని పక్షంలో కనీసం ఒక సంవత్సరానికి సరిపోయే గ్రాసాన్నైనా సమకూర్చాలి. ఇలా చేయటాన్ని గోమేధ యజ్ఞం అని అంటారు. ఈ యజ్ఞం చేస్తే వచ్చే పుణ్యానికి మూడురెట్ల పుణ్యఫలం రామాయణ పారాయణ వ్రతాన్ని చేసినవారికి దక్కుతుంది. ఈ విషయాన్ని నారద మహర్షి వివరించాడు. ఇలా రామాయణ పారాయణ పూజల మహత్వాన్ని గురించి స్కంద పురాణం తెలియ చెబుతుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net