Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu


కడలి కడుపున బడబానలం...
ముద్ర గర్భంలో బడబానలం అనే అగ్ని దాగి ఉంటుందంటారు. ఆ అగ్ని సముద్రంలోకి ఎలా ప్రవేశించింది? అది ఎలా పుట్టింది? ఆ అగ్ని పైకెప్పుడు వస్తుంది? అనే విషయాల్ని తెలిపే కథా సందర్భం ఇది. శివపురాణంలో కామదహనం సన్ని వేశంలో ఈ బడబానలానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి, పార్వతీ దేవికి జన్మించిన కుమారుడి వల్ల రాక్షస సంహారం జరగాలి. అప్పుడే లోకాలు శాంతిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల సంగమం అంత సులభం కాదు. మరెలా? అని దేవతలంతా ఆలోచించారు. చివరకు మన్మథుడిని ప్రేరేపించి శివుడి మనస్సు చలింప చేయాలనుకొన్నారు. ఆ విషయాన్నే మన్మథుడికి చెప్పి పంపారు. మన్మథుడు భయపడుతూనే చెట్టు చాటు నుంచి తన పుష్పబాణాల్ని సంధించాడు. ఆ చెరకు వింటి వేలుకు పార్వతీపతి మనస్సును చలింప చేయటంలో సఫలీకృతుడయ్యాడు. శివుడి మనస్సు చలించి ఎదురుగా ఉన్న పార్వతీ పాణిగ్రహణం చేశాడు. అంతలోనే తన దీక్షను చెడగొట్టిన వారెవరు... అని కోపంతో కలయచూశాడు. పుష్పబాణుడు నగుమోముతో కనిపించాడు. వెనువెంటనే పరమేశ్వరుడి నేత్రం నుంచి అగ్నిజ్వాల ఆవేశంగా వచ్చి మన్మథుడిని దహించింది. ఆ జ్వాల అంతటితో శాంతించలేదు. అది లోకాలన్నింటా తిరుగాడుతుండగా ముల్లోకాల్లోనూ హాహాకారాలు ప్రజ్వరిల్లాయి. శివుడి హలాగ్ని జ్వాలకు దేవతలు, తపశ్శక్తి సంపన్నులైన రుషులూ తట్టుకోలేక పోయారు. చివరకు వారంతా కలసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తమకొచ్చిన కష్టాన్నంతా వివరించి చెప్పారు. బ్రహ్మదేవుడు పరిస్థితిని అర్థం చేసుకొన్న వెంటనే శివుడిని ధ్యానించాడు. ముల్లోకాల్ని శివఫాలాగ్ని జ్వాలల నుంచి రక్షించాలని ప్రార్థించాడు. ఆ తర్వాత ఆ అగ్నిజ్వాలలు ఉన్న ప్రదేశానికి బ్రహ్మ వెళ్ళి పరమేశ్వరుడి అనుగ్రహంతో వాటిని శాంతపరచి దానికి బడబ (ఆడగుర్రం) రూపాన్ని ఏర్పరిచాడు. అప్పుడా బడబానలం సౌమ్య జ్వాలలతో ప్రకాశిస్తూ బ్రహ్మదేవుడికి నమస్కరించింది. బ్రహ్మ ఆ బడబానలాన్ని సముద్ర తీరానికి తీసుకువెళ్ళాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడంతటి వాడు తన సమీపానికి రావటంతో సాగరుడు ఒక పురుషరూపాన్ని ధరించి ఆయన ముందుకొచ్చి నిలిచి నమస్కరించి తాను చెయ్యాల్సిన పని ఏమిటో ఆజ్ఞాపించమన్నాడు. అప్పుడు చతుర్ముఖుడు తన పక్కనున్న బడబానలాన్ని చూపిస్తూ అది శంకరుడి క్రోధాగ్ని అని, తన ఆజ్ఞతో ఆ రూపాన్ని ధరించిన ఆ అగ్నిని సముద్రంలో దాగి ఉండేలా చేయమన్నాడు. ప్రళయకాలం వరకూ సముద్ర గర్భంలో ఆ బడబానలం పూర్తిగా దాగి ఉండాలన్నాడు. భవిష్యత్తులో తాను మళ్ళీ సముద్రుడి సమీపానికి వచ్చిన తర్వాత ఆ అగ్నిని సాగరుడు విడిచిపెట్టవచ్చని చెప్పాడు బ్రహ్మ. అంతకాలం పాటు సముద్రపు నీరే బడబకు ఆహారంగా ఉంటుందన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ బడబానలం తన రాకకంటే ముందు సముద్రాన్ని విడిచి పారిపోకుండా రక్షించే బాధ్యత సముద్రుడిదేనని బ్రహ్మదేవుడు గట్టిగా చెప్పాడు. ఆ బడబానలాన్ని చూస్తేనే భయంకరంగా ఉంది. దాన్ని మరెవరూ భరించలేరు. అయినా లోకక్షేమం కోసం బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు సముద్రుడు దాన్ని తాను భరించటానికి అంగీకరించాడు. ఆ మరుక్షణంలోనే ఆ బడబాగ్ని సముద్రజలాల్ని పీడిస్తూ, మంటలతో చెలరేగుతూ లోపలకు ప్రవేశించింది. బ్రహ్మదేవుడు అనంతరం తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. పురుషరూపంలో వచ్చిన సాగరుడు ఆయనకు నమస్కరించి తన మామూలు రూపమైన సముద్ర రూపంలోకి మారిపోయాడు. అలా లోకాలన్నీ చల్లబడ్డాయి.

కడలి కడుపున దాగిన బడబానలం రగిలే దాకా తెలియదని ఓ కవి అన్న మాటల్లో ఇంతటి పురాణ కథ దాగి ఉంది. ఒక్కోసారి బడబానలం సముద్రం నుంచి తప్పించుకొని పైకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. అప్పుడు సముద్రుడు దాన్ని మళ్ళీ లోపలకు లాగుతుంటాడు. నీళ్ళల్లో నిప్పు దాగి ఉండటం విజ్ఞాన శాస్త్రపరమైన విషయం. ఈ విషయాన్ని ఓ చక్కటి కథా రూపంలో అందించే విజ్ఞానదాయక కథగానూ ఈ అంశం కనిపిస్తుంది.

- యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net