close

వైభవంగా ఆప్తా దశాబ్ద వేడుకలు

మేరీల్యాండ్‌: అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్తా) నేషనల్‌ కన్వెన్షన్‌ను స్థాపించి 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2018 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు మూడు రోజుల పాటు 10వ వార్షికోత్సవాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ జాతీయ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 4 వేల మంది తెలుగు వారు హాజరయ్యారు. వీరందరికీ ఆప్తా కన్వెన్షన్ టీం తరఫున ఆప్తా బోర్డు ఛైర్ పర్సన్‌ రాధిక నైగాపుల, ప్రెసిడెంట్ గోపాల గూడపాటి, కన్వెన్షన్ 2018 కన్వీనర్ ధీరజ్ ఆకుల, కో కన్వీనర్స్ నటరాజు ఇల్లూరి, రెడ్డయ్య ప్రత్తిపాటి, శ్రీనివాస్ సిద్ధినేని, లలిత బైరా, ఆప్తా ఫౌండర్స్ ప్రసాద్ సమ్మెట, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట, కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ ఆనంద్ జవ్వాజి, సభ్యులు వీరబాబు ప్రత్తిపాటి, రాజ్ సిరిగిరి, శివ యర్రంశెట్టి, మధు దాసరి, రవీంద్రనాథ్ కొట్టే, రవి ముళ్ళపూడి, కిషోర్ ముత్యాల, రాజేష్ అంకం, ప్రవీణ్ అండపల్లి, బోర్డు సెక్రటరీ శివ కొప్పరాతి, జనరల్ సెక్రటరీ శౌరి ప్రసాద్ కొచ్చెర్ల, కమిటీ సభ్యులు శుభాభినందనలు తెలిపారు. శ్రీనివాస కళ్యాణంతో మొదలైన కన్వెన్షన్ రెండు రోజులపాటు జరిగింది. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.

ఎస్వీఆర్‌ శత జయంతి ఉత్సవాలను వేదికపైన మొట్ట మొదటి సారిగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీఆర్ సిల్వర్ కాయిన్‌, విగ్రహావిష్కరణ, ఎస్వీఆర్‌పై గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన గీతం, ప్రత్యేకసంచికను ఆవిష్కరించారు.సుబ్బు కోటకి సంస్థ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. మేరీల్యాండ్ సెక్రటరీ అఫ్ స్టేట్ జాన్ సి. వబెన్‌ స్మిత్‌ చేతుల మీదుగా రఘుపతి వెంకయ్య నాయుడు ఆప్తా అవార్డుని నిర్మాత అల్లు అరవింద్‌కి అందించి సత్కరించారు. దాసరి అరుణ్ కుమార్, రవణం స్వామి నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, ప్రముఖ సాహితీవేత్త ఎర్రంశెట్టి సాయి, ప్రముఖ గాయకుడు జి ఆనంద్, ప్రముఖ టీటీ ప్లేయర్ ఉమేష్ ఆచంట లను ఈ సందర్భంగా సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. సంఘాన్ని స్థాపించి పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రపంచ మహాసభలను విజయవంతం చెయ్యటానికి హాజరైన రాజకీయ నేతలు పల్లం రాజు, కన్నా లక్ష్మీ నారాయణ, బొత్స సత్యనారాయణ, సి రామచంద్రయ్య , కదిరి బాబు రావు , పి విజయ బాబు , రత్నం ముత్యాల, కృష్ణా రావు ముత్తంశెట్టి, దిలీప్ బైరా, రత్నాకర్ పండుగాయల, సామినేని ఉదయ భాను, వేణు గోపాల రావులు కన్వెన్సన్‌ కమిటీ తరఫున హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్, కౌశిక్ బాబు అభినయం, శ్రుతకీర్తి నాట్యం, విభా ఫ్యాషన్స్ అధినేత్రి వినయ గోపిశెట్టి ఆధ్వర్యంలో సంధ్య బయిరెడ్డి కోరియోగ్రఫీలో నిర్వహించిన ఫాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.