close

తాజావార్తలు

విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా షురూ

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇసబెల్‌ లీట్ కథానాయికలు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ పతాకంపై కేఏ వ‌ల్ల‌భ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుంద‌ర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు సినిమాను స‌మర్పిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖులు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సుబ్బిరామిరెడ్డి క్లాప్ కొట్టారు. విజయ్‌ దేవరకొండ ఇటీవల ‘నోటా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన ముఖ్యమంత్రిగా ఆకట్టుకున్నారు. మరోపక్క విజయ్ హీరోగా ‘టాక్సీవాలా’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి.


జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని

రాజకీయం

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

జనరల్‌

స్పోర్ట్స్

బిజినెస్‌

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.