ఉక్కు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: వైకాపా 

తాజా వార్తలు

Updated : 14/07/2021 14:25 IST

ఉక్కు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: వైకాపా 

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దిల్లీలో చేపట్టే ఆందోళనలకు వైకాపా సంఘీభావం తెలిపింది. ఇవాళ విశాఖలో కార్మిక సంఘాలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, మాధవి భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై చర్చించారు. ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందనే కారణాన్ని చూపించి అమ్మెస్తామనడాన్ని వ్యతిరేకిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

‘‘స్టీల్‌ ప్లాంట్‌ కోసం సొంత గనులు ఇవ్వాలి. గనులు బయటి నుంచి ఇవ్వక్కర్లేదు. మన రాష్ట్ర సరిహద్దు కోటియాలో గనులు ఉన్నాయి. దీనిపై ఉక్కు శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిని కలుస్తాం. భాజపాయేతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తాం. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఒప్పుకోమని ముత్తంశెట్టి స్పష్టం చేశారు. కేంద్రం ఇలా జాతీయ సంపదను విక్రయించడం సరికాదన్నారు. నష్టాన్ని భర్తీ అయ్యేలా కేంద్రం సహకరించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని