అప్పుల్లో నంబర్‌ 1
close

ప్రధానాంశాలు

అప్పుల్లో నంబర్‌ 1

11 నెలల్లో రూ.79,191 కోట్ల రుణం తీసుకున్న రాష్ట్రం
దేశంలోనే ఇది అత్యధికం
బడ్జెట్‌లో పొందుపరిచిన దానికంటే 63% అధికంగా అప్పు
  కాగ్‌ లెక్కల్లో వెల్లడి
ఈనాడు - దిల్లీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మోత మోగిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే భారీ రుణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు (11 నెలల్లో) రూ.79,191 కోట్ల అప్పులు తీసుకున్నట్లు కాగ్‌ లెక్కలు వెల్లడించాయి. దేశంలో ఆర్థికంగా, జనాభాపరంగా పెద్దగా ఉన్న 14 రాష్ట్రాల్లో ఏదీ ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో పొందుపరిచిన అంచనాలతో పోలిస్తే 63.97% మేర రుణాలు అధికంగా సేకరించింది. కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలూ దాదాపు ఒకేస్థాయిలో (60%దాకా) ఉన్నప్పటికీ అప్పుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నింటినీ మించిపోయింది. కాగ్‌ లెక్కలను విశ్లేషిస్తే ఏపీ ఈ 11 నెలల్లో నెలకు సగటున రూ.7,199 కోట్లు రుణం సేకరించినట్లు అర్థమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఉన్న రూ.52,090 కోట్ల అప్పుతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి అప్పుల భారం 52% పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం లేకపోయినా అప్పుల్లో ఇంత భారీ తేడా రావడానికి కారణమేంటో స్పష్టంగా కనిపించలేదు. బడ్జెట్‌లో పొందుపరిచిన ఖర్చుల్లో ఇప్పటి వరకు పింఛన్లు (102%), రాయితీలు (123%) మాత్రమే అంచనాలను మించాయి. మిగిలిన ఖర్చులన్నీ ఆలోపే ఉన్నాయి. ఫిబ్రవరి వరకు రెవెన్యూ వ్యయం  86.96%, మూలధన వ్యయం కేవలం 66.98% మాత్రమే జరిగింది. మిగిలిన నెల రోజుల్లో మిగతాది ఖర్చు చేయడం కష్టమే.
ఆదాయం కంటే అప్పే ఎక్కువ
గత 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను, పన్నేతర ఆదాయం రూ.71,699 కోట్లు కాగా అప్పు రూ.79,191 కోట్లు. అంటే ఆదాయం కంటే అప్పు  10.44% అధికం. దేశంలోని 14 పెద్ద రాష్ట్రాల్లో అయిదింటి ఆదాయం ఆంధ్రప్రదేశ్‌ కంటే అధికంగా పడిపోయింది. ఆ రాష్ట్రాలకు బడ్జెట్‌లో చెప్పినదాంట్లో 60%లోపే రంగాలపై వ్యయం 78.90%కే పరిమితమైంది. దేశంలోని 14 పెద్ద రాష్ట్రాల్లో అయిదింటి ఆదాయం ఆంధ్రప్రదేశ్‌ కంటే అధికంగా పడిపోయింది. ఆ రాష్ట్రాలకు బడ్జెట్‌లో చెప్పినదాంట్లో 60%లోపే ఆదాయం వసూలైంది. కానీ అవేవీ ఇంత భారీస్థాయిలో అప్పులు తీసుకోలేదు. 9 రాష్ట్రాలు బడ్జెట్‌లో చెప్పినదానికంటే తక్కువ మొత్తంలోనే రుణాలకు పరిమితమయ్యాయి. అయిదు రాష్ట్రాలు 100%కి మించి అప్పులు చేశాయి. చెప్పినదానికంటే అధికంగా రుణాలు తీసుకున్నవాటిలో (నిష్పత్తిపరంగా) రాజస్థాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఏపీ 2, పశ్చిమబెంగాల్‌ 3, తెలంగాణ 4, కేరళ 5వ స్థానాల్లో ఉన్నాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని