గంటకు 1,007 మందికి కొవిడ్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంటకు 1,007 మందికి కొవిడ్‌

 తాజాగా రికార్డు స్థాయిలో 24,171 కేసులు
 101 మంది మృతి
 వరుసగా రెండో రోజూ 25 శాతానికిపైగా పాజిటివిటీ రేటు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రతి గంటకు సగటున 1,007 మంది కొవిడ్‌ బారిన పడుతుండగా.. నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 24,171 మందికి కరోనా నిర్ధారణ అయింది. 101 మంది మరణించారు. ఒకే రోజు వందకుపైగా మరణాలు నమోదవ్వటం ఈ నెలలో ఇది రెండోసారి. శనివారం ఉదయం 9 గంటలనుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 94,550 నమూనాలు పరీక్షించగా అందులో 25.56 శాతం మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వరుసగా రెండో రోజు కూడా 25 శాతానికిపైగా పాజిటివిటీ రేటు నమోదైంది. ఈనెల ఒకటో తేదీన 19.76 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతూ ఆదివారంనాటికి 25.56 శాతానికి చేరింది. ఒక రోజు వ్యవధిలో 24,171 కేసులు నమోదవ్వటం కూడా తొలి, మలి దశలో ఇదే మొదటిసారి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కు, మరణాలు 9,372కు చేరాయి.

అనంతపురం జిల్లాలో అత్యధిక కేసులు
* అనంతపురం జిల్లాలో 24 గంటల వ్యవధిలో  తొలిసారి 3,356 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.
* రాష్ట్రంలో అతి తక్కువగా కృష్ణా జిల్లాలో 705 కేసులు నమోదయ్యాయి.
* క్రియాశీల కేసుల సంఖ్య 2,10,436కు చేరింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 29,091 క్రియాశీల కేసులున్నాయి.
* తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో క్రియాశీల కేసులు 20 వేలు దాటేశాయి.
* 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో  14 మంది మరణించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని