మళ్లీ తెరుచుకున్న సినిమా హాళ్లు

ప్రధానాంశాలు

మళ్లీ తెరుచుకున్న సినిమా హాళ్లు

10-15 శాతం థియేటర్లలో ప్రారంభమైన సినిమాల ప్రదర్శన
50 శాతం సిటింగ్‌ సామర్థ్యంతో నిర్వహణ

ఈనాడు, అమరావతి: మూడు నెలల తర్వాత మళ్లీ పెద్ద తెరపై బొమ్మ పడింది. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో మూతపడిన సినిమా హాళ్లలో కొన్ని శుక్రవారం తెరుచుకున్నాయి. రాష్ట్రం మొత్తం మీద సుమారు 10-15 శాతం థియేటర్లలోనే శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. మూడు కొత్త సినిమాలు... ఇష్క్‌, తిమ్మరుసు, నరసింహపురం శుక్రవారం విడుదలయ్యాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం మూడు షోలనే వేస్తున్నారు. థియేటర్లను 50 శాతం సిటింగ్‌ సామర్థ్యంతోనే నడుపుతున్నారు. మరిన్ని సినిమాలు విడుదలైతే మిగతా థియేటర్లు కూడా క్రమంగా తెరుచుకుంటాయని తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని