ప్రజారవాణా వ్యవస్థను ప్రగతి పథంలో నడిపిద్దాం

ప్రధానాంశాలు

ప్రజారవాణా వ్యవస్థను ప్రగతి పథంలో నడిపిద్దాం

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు
ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌గా విజయానందరెడ్డి ప్రమాణం

ఈనాడు, అమరావతి: ప్రతి గ్రామంలో ప్రజలకు సేవలందించే ప్రజారవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేలా అంతా కలిసి పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పేర్ని నాని(రవాణా), వెలంపల్లి శ్రీనివాస్‌(దేవాదాయ) కోరారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌గా ఎం.సి.విజయానందరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... ‘ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈమేరకు కొత్త పాలకవర్గమూ తమవంతు కృషి చేయాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఇందుకు విజయానందరెడ్డిని వరించిన పదవే నిదర్శనం’ అని తెలిపారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని