పట్టాభి కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

ప్రధానాంశాలు

పట్టాభి కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెదేపా నేత పట్టాభిరామ్‌ను ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించాలన్న పిటిషన్‌పై విచారణను విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తి ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా పట్టాభి తరఫున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. పట్టాభికి హైకోర్టులో బెయిలు మంజూరైందని, ఈ సమయంలో కస్టడీ పిటిషన్‌ అమలులో ఉండదని తెలిపారు. పిటిషన్‌ చెల్లుబాటుపై వాదనలు వినిపించడానికి పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమయం కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని